హ్యాపీ ఇండియా ఉత్పత్తులు ప్రారంభం | Happy India Product Launch | Sakshi
Sakshi News home page

హ్యాపీ ఇండియా ఉత్పత్తులు ప్రారంభం

Aug 17 2014 1:37 AM | Updated on Sep 2 2017 11:58 AM

హ్యాపీ ఇండియా ఉత్పత్తులు ప్రారంభం

హ్యాపీ ఇండియా ఉత్పత్తులు ప్రారంభం

హ్యాపీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా వ్యక్తిగత సేవలను అందించేందుకు రూపొందించిన ‘బిజీబాయ్స్. ఇన్’ వెబ్‌సైట్‌ను రాష్ట్ర రవాణా శాఖామంత్రి మహేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.

బంజారాహిల్స్:  హ్యాపీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా వ్యక్తిగత సేవలను అందించేందుకు రూపొందించిన ‘బిజీబాయ్స్. ఇన్’ వెబ్‌సైట్‌ను రాష్ట్ర రవాణా శాఖామంత్రి మహేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా హ్యాపీ ఇండియాలో భాగమైన డాక్టర్ శైలూస్ పేరుతో ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను ఆవిష్కరించారు. అంతేకాకుండా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ సేవలను పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని కోరారు. ఇది అందరికీ ఉపయోగపడే వెబ్‌సైట్ అన్నారు. ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించనున్నారని, నాణ్యమైన సరుకులను సకాలంలో సరసమైన ధరలలో అందించవచ్చని పేర్కొన్నారు.

వినియోగదారుల వద్దకే టెక్నాలజీని ఉపయోగించి ఈ సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాలినేని శీనయ్య, సుచిరిండియా చైర్మన్ కిరణ్, చలసాని శ్రీనివాస్, రుద్రరాజు పద్మరాజు, హ్యాపీ ఇండియా చైర్మన్ శైలజానాథ్, సీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement