పాఠశాలల్లో అర్ధవార్షిక పరీక్షలు వాయిదా | half yearly exams postponed in telangana | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో అర్ధవార్షిక పరీక్షలు వాయిదా

Dec 16 2014 12:41 AM | Updated on Sep 2 2017 6:13 PM

తెలంగాణలోని పాఠశాలల్లో ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన అర్ధవార్షిక పరీక్షలను విద్యాశాఖ వాయిదా వేసింది.

* వచ్చే నెల 3 నుంచి 9 వరకు నిర్వహణ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలల్లో ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన అర్ధవార్షిక పరీక్షలను విద్యాశాఖ వాయిదా వేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు జగదీశ్వర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరీక్షలను వచ్చే నెల 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్టు  ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మార్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓలను ఆయన ఆదేశించారు.

సంక్రాంతి సెలవులకు ముందు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి  పీఆర్టీయూ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ మార్పు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా పరీక్షల షెడ్యూల్ మార్చినందుకు మంత్రి జగదీశ్‌రెడ్డికి పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement