తెగులు.. దిగులు!

 Ground Nut Pest And Disease - Sakshi

పంట నష్టపోతున్న వేరుశనగ రైతు 

రాత్రి పూట పంటను నాశనం చేస్తున్న లార్వా 

మందులు పిచికారీలో రైతన్న సతమతం

సాక్షి, దామరగిద్ద: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతున్నకు వేరుశనగ  సాగులోనూ  కష్టాలు తప్పడం లేదు. కృత్రిమ ఎరువుల వాడకం వాతవరణ పరిస్థితులు కలుపుమందులు వాడకంతో కొత్త తెగుళ్లు పంటలను ఆశిస్తూ తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. ఆకుమచ్చ తెగులు, పొగాకు లద్దెపురుగు, ఆకుముడత పురుగు లార్వా వంటి చీపపీడల నివారణలో రైతన్నలు తలమునకలౌతున్నారు.  ఓ వైపు సరైన వర్షాలు లేక ఇప్పటికే బోర్లల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరో వైపు చీడపీడలు సోకడంతో పంటలను కాపాడుకోవడంతో రైతులు అహర్నిషలు శ్రమిస్తున్నారు.   

అధికారుల సూచనమేరకే సాగు  
మండలంలోని  దామరగిద్ద, మద్దెల్‌బీడ్, కాన్‌కుర్తి, ఉల్లిగుండం, క్యాతన్‌పల్లి, వత్తుగుండ్ల, కాంసాన్‌పల్లి, దేశాయ్‌పల్లి, ఆశన్‌పల్లి చాకలోన్‌పల్లి, లోకుర్తి నర్సాపూర్, మొగుల్‌మడ్క అన్నాసాగర్‌ తదితర గ్రామాల్లో వేరుశనగ పంటను ఎక్కువగా సాగు చేశారు. మండలంలోని రైతులకు  వ్యవసాయ శాఖ అధికారులు గత సెప్టెంబర్‌ 18న వేరు శనగ (కే6 రకం) విత్తనాలను పంపిణీ చేశారు. మండల రైతులకు 500 క్వింటాళ్లకు పైగా  విత్తానాలను ప్రభుత్వం అందించిని 35 శాతం సబ్సిడీపై (బస్తా 30 కేజీలు రూ.1250 చొప్పున) కొనుగోలు చేశారు. మొత్తం 1600కు పైగా బస్తాల విత్తనాలతో పాటు రైతులు తాము సొంతగా నిల్వ చేసిని విత్తనాలను సైతం సాగు చేశారు. విత్తనాలు సకాలంలో అందడంతో ఆయా గ్రామాల రైతులు  గత సెప్టెంబర్‌ చివరి వారం అక్టోబర్‌ మొదటి వా రాల్లో వేరుశనగ పంటను సాగుచేసుకున్నారు. పం ట సాగు చేసి 30 నుంచి 45 రోజులు గడుస్తుంది.   

పంటను ఆశిస్తున్న తెగుళ్లు 
సాధారణంగా పంట 25రోజుల లోపు ఉన్న సమయంలో పంటలపై తెగుళ్లు పరుగుల దాడి అధికం గా ఉంటుంది. ప్రస్తుతం ఇదే దశలో ఉన్న వేరుశనగ పంటను పొగాకు లద్దెపరుగు, ఆకుముడత ప రుగు లార్వా ఆకుమచ్చ తెగుళ్లు సోకడంతో పం టలు దెబ్బతింటున్నాయి. పోగాకు లద్దెపురుగు రాత్రి సమయంలో బయటకు వచ్చి లార్వా దశలో పంట ఆకులను మేస్తూ పంట ఎదుగుదలను దెబ్బతీస్తుంది. దీనికి తోడు  ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి ఊడలు దిగకుండా గింజలు పట్ట కుండా పంటను దెబ్బతీస్తున్నాయి. వీటి నివారణకు తీసుకోవల్సిన చర్యలపై వ్యవసాయ అధికారులు స్పందించి తమ పంటలను కాపాడుకోవడంలో తగిన సలహాలు  సూచనలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా రైతులు ఎన్నికల వి«ధులతో పాటు రైతులకు పెట్టుబడి సహాయం అందించడంతో బిజీగా ఉండటంతో రైతులకు అవసరమైన సలహాలు సూచనలు  చేసే వారు కరువయ్యారు. 

అధికారులు సలహా ఇవ్వాలి 
వేరుశనగ పంటలకు సోకిన తెగుళ్లు పురుగుల నివారణలో రైతులు అవసమైన సలహాలు సూచనలు అందజేయాలి. ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి ఏఏ చీడపీడల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏఏ మందులు పిచికారీ చేయాలో తెలపాలి. అధికారులు ఇతర పనులు పేరుతో పంటలను పరిశీలించడం లేదు. రైతులకు నష్టం వాటిల్లకుండా సకాలంలో స్పందించి పంటలను కాపాడుకోవడంలో రైతులకు అవగాహణ కల్పించాలి. 
– వెంకటప్ప, రైతు వత్తుగుండ్ల 

మందు పిచికారీ చేయాలి
వేరుశనగ పంట సాగు   చేసిన నలభై రోజుల వ్యవధిలో ఉన్న సమయంలో తెగుళ్లు పురుగులు అధికంగా ఆశిస్తుంటాయి. ఆకుమచ్చ తెగుళ్లు, పొగాకు లద్దెపరుగు, లార్వా దశలో రాత్రి వేళలో పంటను ఎక్కువగా నష్ట పరుస్తుంటాయి. వీటి నివారణకు ఎక్టాకొనెజోల్‌ ఎకరాకు 400ఎంఎల్‌ పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు  క్లోరిఫైరీపాస్‌ ఎకరానికి 400ఎంఎల్‌ లేదా 300 ఎంఎల్‌ మోనోకొటాపాస్‌ను పంటలపై పిచికారీ చేయాలి. లార్వా«ను నాశనం చేసేందుకు అరకిలో బెల్లం, పావులీటలర్‌ మోనోకొటపాస్‌ను తగినంత వరితౌడులో కలిపి ముద్దలుగా చేసి పొలం ఉంచాలి. పంట దిగుబడి నాణ్యత కోసం సాగుచేసిన 40 రోజుల వ్యవధిలోనే ఎకరానికి 200కిలోల జిప్సంను పంట మొదల్లో చల్లాలి.  
– జాన్‌ సుధాకర్, ఏడీఏ, నారాయణపేట 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top