బంగారం కోసం అమ్మమ్మను నరికేశాడు | Sakshi
Sakshi News home page

బంగారం కోసం అమ్మమ్మను నరికేశాడు

Published Sat, May 9 2015 10:21 AM

బంగారం కోసం అమ్మమ్మను నరికేశాడు - Sakshi

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరులోని గాంధీనగర్లో శనివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం సొంత అమ్మమ్మను మనుమడు నరికి చంపాడు. అనంతరం నిందితుడు ధనరాజ్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ధన్రాజ్పై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం... ధనరాజ్ తల్లిదండ్రులను విడిచి అమ్మమ్మతో కలిసి తాండూరులో నివసిస్తున్నాడు.

వ్యసనాలకు బానిస అయిన ధనరాజ్ తరచు నగదు కావాలని అమ్మమ్మను వేధించేవాడు. ఆ క్రమంలో నగలు కావాలని అమ్మమ్మను అడిగాడు. అందుకు ఆమె నిరకరించింది. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో తాగిన మైకంలో ఉన్న ధన్రాజ్... అక్కడే ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేసి... నరికాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. 

Advertisement
 
Advertisement