ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక అదృశ్యం | Girl missing | Sakshi
Sakshi News home page

ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక అదృశ్యం

Jan 8 2016 7:52 PM | Updated on Sep 3 2017 3:19 PM

ఇంట్లో చెప్పకుండా బయటికు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

యాకుత్‌పురా : ఇంట్లో చెప్పకుండా బయటికు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భవానీనగర్ తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన సయ్యద్ సలీం, షహనాజ్ ఉన్నీసా దంపతుల కూతురు బషీరున్నీసా (16) ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది.

చార్మినార్ వద్ద బట్టల దుకాణంలో పని చేసే తల్లి షహనాజ్ ఉన్నీసా రాత్రి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్నీ ప్రాంతాల్లో వాకబు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement