బాలిక, వివాహితపై లైంగికదాడి | Girl, married women on sexual assault | Sakshi
Sakshi News home page

బాలిక, వివాహితపై లైంగికదాడి

Jul 23 2015 12:05 AM | Updated on Jul 23 2018 9:13 PM

ప్రేమించానంటూ వెంటబట్టాడు.. మాట్లాడుకుందామని చెప్పి బాలికను, ఆమె వదినను తోటలోకి రమ్మన్నాడు..

నడిగూడెం
 ప్రేమించానంటూ వెంటబట్టాడు.. మాట్లాడుకుందామని చెప్పి బాలికను, ఆమె వదినను తోటలోకి రమ్మన్నాడు.. ఆపై తన స్నేహితుడితో కలిసి ఇద్దరిపై లైంగికదాడి చేశాడు.. ఇదీ.. నడిగూడెం మండలం బృందావనపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బృందావనపురం గ్రామానికి చెందిన జమ్మి వేణు ఇదే గ్రామానికి చెందిన 15 బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. ఆమెకు మాయమాటలు చెప్పి  నెల రోజుల క్రితం తోటలోకి రమ్మన్నాడు. అనుమానంతో ఆ బాలిక తన వదినను తీసుకుని వెళ్లింది. అప్పటికే వేణు తన స్నేహితుడు గోవర్దన్‌తో వేచిచూస్తున్నాడు. కాగా, తోటలోకి వెళ్లిన బాలిక, సదరు వివాహితపై ఇద్దరు కలిసి లైంగికదాడి చేశారు. కాగా, పెళ్లి విషయమై బాలిక వేణును నిలదీయంతో నిరాకరించాడు. దీంతో బాధితులు బుధవార పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణుపై నిర్భయ, గోవర్ధన్‌పై లైంగికదాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బిల్లా కిరణ్‌కుమార్ తెలిపారు.  కోదాడ రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement