కేరళ ఎక్స్‌ప్రెస్‌లో కొట్టుకున్నారు.. | fight in kerala express | Sakshi
Sakshi News home page

కేరళ ఎక్స్‌ప్రెస్‌లో కొట్టుకున్నారు..

Apr 4 2015 3:06 PM | Updated on Oct 2 2018 6:46 PM

కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా మట్టెవాడ రైల్వేస్టేషన్‌లో జరిగింది.

వరంగల్ : కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా మట్టెవాడ రైల్వేస్టేషన్‌లో బయటపడింది.

వివరాల ప్రకారం.. కేరళకు చెందిన రాజేష్, రామచంద్ర ఉన్నితన్‌లు ఉజ్బెకిస్తాన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. స్వదేశం వచ్చిన ఇద్దరూ ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి కేరళ వెళ్లేందుకు శనివారం కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఉన్నితన్, రాజేష్‌పై దాడి చేసి తలపై కొట్టాడు. రాజేష్‌ గాయపడటంతో విషయం గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు రైలు వరంగల్ మట్టెవాడ స్టేషన్‌లో ఆగగానే రాజేష్‌ను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వివరాలను సేకరిస్తున్నారు. గొడవకు గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement