అప్పులబాధ తాళలేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది.
శివంపేట (మెదక్) : అప్పులబాధ తాళలేక ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కాముని లక్ష్మయ్య(50) సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా... ఇంటికి సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
లక్ష్మయ్య తనకున్న ఎకరం పొలంలో పంటల సాగుకు రెండు బోరు బావులు తవ్వించగా నీరు పడలేదు. మరోవైపు కూతురి వివాహానికి, కుటుంబ పోషణ కోసం రూ.3.5 లక్షలు అప్పు చేశాడు. దీంతోపాటు పెళ్లి కావాల్సిన మరో కుమార్తె ఉండడంతో, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక లక్ష్మయ్య మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.