కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: ఎర్రబెల్లి | Errabelli Dayakar Rao fired on KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: ఎర్రబెల్లి

Aug 9 2014 3:02 AM | Updated on Aug 25 2018 7:03 PM

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: ఎర్రబెల్లి - Sakshi

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: ఎర్రబెల్లి

ప్రజలను మాయమాటలతో గారడీ చేస్తూ తుగ్లక్ పాలన సాగిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై టీడీపీ విరుచుకుపడింది.

సాక్షి, హైదరాబాద్: ప్రజలను మాయమాటలతో గారడీ చేస్తూ తుగ్లక్ పాలన సాగిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై టీడీపీ విరుచుకుపడింది. 19న ఒక్కరోజే సర్వే చేసి ప్రతిఒక్కరి వివరాలు సేకరిస్తానని చెప్పడమే దీని కి నిదర్శనమని ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం ఆయన టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.  సామాజిక సర్వేను వారం రోజులు నిర్వహిస్తే ప్రజలకు, ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులకు విద్యుత్ ఇవ్వకుండా లాఠీచార్జ్‌లు చేయిస్తూ, విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించకుండా రోడ్డు మీద పడేస్తూ సాగిస్తున్న పాలనపై ప్రజలతో కలిసి తిరగబడతామన్నారు. రమణ మాట్లాడుతూ కేసీఆర్ రెండు నెలల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement