పల్లె సమగ్ర సేవా కేంద్రాలుగా ఈ-పంచాయతీలు: కేటీఆర్ | e- panchayats set up to village integrity centres says minister ktr | Sakshi
Sakshi News home page

పల్లె సమగ్ర సేవా కేంద్రాలుగా ఈ-పంచాయతీలు: కేటీఆర్

Jun 3 2015 12:35 PM | Updated on Aug 30 2019 8:24 PM

పల్లె సమగ్ర సేవా కేంద్రాలుగా ఈ-పంచాయతీలు: కేటీఆర్ - Sakshi

పల్లె సమగ్ర సేవా కేంద్రాలుగా ఈ-పంచాయతీలు: కేటీఆర్

పల్లె సమగ్ర కేంద్రాలుగా ఈ - పంచాయతీలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

హైదరాబాద్: పల్లె సమగ్ర కేంద్రాలుగా ఈ - పంచాయతీలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ వార్షిక నివేదికను బుధవారం ఆయన ఇక్కడ వెల్లడించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ప్రజల పన్నులతో ప్రభుత్వ పథకాలను బాధ్యతాయుతంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మరుగు దొడ్లను నిర్మించి 2019 కల్లా బహిరంగ మల, మూత్ర విసర్జనలు లేకుండా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతామన్నారు. ప్రతిపక్షాలు ఉనికి కోల్పోతామనే భయంతోనే వాటర్ గ్రిడ్ పై విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement