జోరుగా మామిడి ఒరుగు వ్యాపారం

Dried Mangos business - Sakshi

పల్లెవాసులకు భలే ఉపాధి

నీడపట్టునే పని

ప్రతి కూలీ రోజూ రూ.300 వరకు సంపాదన

స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం కల్పంచాలని వినతి

కుల్కచర్ల వికారాబాద్‌: మామిడి ఒరుగుతో మండల పరిధి లోని చౌడాపూర్, మందిపల్, వీరాపూర్, కాముని పల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాలలో ప్రజలు ఉపాధి పొ ందుతున్నారు. స్థానికంగా మామిడి తోటలు త క్కువగా ఉండటంతో ఇతర ప్రాంత్రాల నుంచి  మామిడి కాయలు దిగుమతి చేసుకుని ఇక్కడి ఒ రుగు చేసి మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో చా లా మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. గ్రా మాలలో నీడకు కూర్చుని ఒరుగు తయారు చేస్తున్నారు.

రోజుకు  200 నుంచి 300 రూపాయల వరకు ఉపాధి పొందుతున్నారు. గాలివానకు మామిడి కాయలు రాలిపోవడంతో అవి వృథా కాకుండా వాటిని కోసి ఒరుగు తయారు చేసుకున్నారు. ఆదే ఉపాధిగా ఈ గ్రామాలలో ప్రతి సంవత్సరం సీజన్‌ వ్యాపారంగా మారింది. నిరుద్యోగ యువకులు మండల పరిధిలోని పలు గ్రామలలో ఉన్న మామిడి తోటలను పూత దశలోనే  కొనుగోలు చేస్తున్నారు. వాటిని కాపలా కాసీ మామిడి కాయలు కోసి మహిళల చేత ఒరుగు తయారు చేస్తున్నారు.

దీంతో  స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. మండల పరిధిలోని 6 గ్రామాలలో నెల రోజుల పాటు రోజు సూమారు 100 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ మామిడి తోటలు లభ్యం కాకుంటే అనంతపురం నుంచి మామిడి కాయలు తీసుకువచ్చి  ఒరుగు తయారు చేస్తున్నామని అంటున్నారు. ఒక సంచి మామిడి కాయలను 150 రూపాయల నుంచి 200 రూపాయలు వరకు ఇచ్చి ఒరుగు తయారు చేస్తున్నారు. ఈ ఒరుగుకు హైదరాబాద్‌లో మార్కెట్‌ లేదని నిజామాబాద్‌ తీసుకెళ్లి మార్కెట్‌ చేస్తున్నామని హైదరాబాద్‌ ప్రాంతంలో మార్కెట్‌ ఉంటే బాగుండేదని,  స్థానికంగా  మార్కెట్‌ సౌకర్యాం కల్పించాలని ఒరుగు వ్యాపారులు కోరుతున్నారు.

సీజన్‌లో ఉపాధి పొందుతున్నాం

ప్రతి సీజన్‌లో రోజు కూలీ వరకు సంపాది స్తాం. మామిడి కాయలు చిన్నగా ఉన్న సమయంలో తోటలను రై తుల నుంచి కొనుగో లు చేస్తాం. రెండు నెలలు వాటిని కాపలా కాసి కాయలు పెద్దగా అయిన తరువాత  కో సి ఒరుగు తయారు చేయిస్తున్నాం. ఒక్కొక్క సారి  కాయలు చిన్నగా ఉన్నప్పుడు రాలి పో తాయి.  అప్పడప్పడు నష్టం కూడా వస్తుంది. 
– వెంకటేష్, వ్యాపారి, విఠలాపూర్

రోజూ రూ. 200 సంపాదిస్తున్నాం

ఈ ఒరుగు ఉన్నని రో జులు రోజుకు 200 సంపాదిస్తాం. ఎండకు వెళ్లి పనిచేయాలంటే చే యలేక పోతున్నాం. చె ట్ల కింద కూర్చుని మా మిడి కాయలు  కోసి ఒరుగు తయారు చేస్తా ం. ఒక సంచికి 150 రూపాయలు ఇస్తారు, ఇ ద్దరం కలిసి రెండు నుంచి మూడు సంచులు కోస్తాం.  

 – లక్ష్మమ్మ  విఠలాపూర్, కుల్కచర్ల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top