‘అన్నం’కు ‘సాయిస్ఫూర్తి’ విరాళం  | Donation To Annam Foundation | Sakshi
Sakshi News home page

‘అన్నం’కు ‘సాయిస్ఫూర్తి’ విరాళం 

Aug 16 2018 11:05 AM | Updated on Aug 16 2018 11:05 AM

Donation To Annam Foundation - Sakshi

రూ.లక్ష చెక్కును అందజేస్తున్న సేవా సమితి సభ్యులు 

సత్తుపల్లి : జిల్లా కేంద్రంలో అన్నం సేవా ఫౌండేషన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం, సాయిస్ఫూర్తి స్టూడెంట్స్‌ సేవా సమితి బుధవారం రూ.లక్ష విరాళాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ అన్నం శ్రీనివాసరావుకు అందించారు.

అన్నం ఫౌండేషన్‌లో కళ్లులేని, మూగవారికి, వికలాంగులకు, మతిస్థిమితం లేనివారికి, వయోవృద్ధులు, పక్షవాతం, పైలేరియా వ్యాధులతో బాధపడుతున్న అనాథలకు అందిస్తున్న సేవల కోసం విరాళాన్ని అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు దిలీప్, రఘువంశీ, దివ్య, నవ్య, నాగరాజు, మానస, షణ్ముఖరెడ్డి, అన్నం సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement