డివిజన్‌కే ఆదర్శం | Division Ideal | Sakshi
Sakshi News home page

డివిజన్‌కే ఆదర్శం

Jun 19 2016 11:55 PM | Updated on Oct 1 2018 3:56 PM

ప్రజలకు చైతన్యం కలిగించేలా భావితరాలకు మంచి భవిష్యత్‌ను అందేలా చక్కటి కార్యక్రమాలు చేపడుతూ దుగ్గొండి ...

దుగ్గొండి : ప్రజలకు చైతన్యం కలిగించేలా భావితరాలకు మంచి భవిష్యత్‌ను అందేలా చక్కటి కార్యక్రమాలు చేపడుతూ దుగ్గొండి పోలీసులు డివిజన్‌కే ఆదర్శంగా నలిచారని నర్సంపేట డీఎస్పీ దాసరి మురళీధర్ అన్నారు.  మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో జిల్లాలోనే తొలిసారిగా భారీ ఫాంపాండ్(14మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతు)ను నిర్మించారు. పోలీసులు స్వయంగా శ్రమధానం చేసి నిర్మాణం చేశారు. ఆవరణలో మురుగునీటిని తరలించడానికి 4చోట్ల ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను, నిర్మాణ పనులు పూర్తి అయిన ఫాంపాండ్‌ను  డీఎస్పీ మురళీధర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ప్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో హరితహారంలో మొక్కలు నాటడం, మిషన్ కాకతీయలో చెరువు అభివృద్ధి పనులు, ఇంకుడు గుంతలు, ఫాంపాండ్‌ల నిర్మాణ పనులను స్టేషన్‌లో స్వయంగా అమలు పరుస్తూ  ముందుకు సాగుతున్నామన్నారు.


ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్న ఎస్సై వెంకటేశ్వర్లు అభినందనీయులన్నారు. పోలీసులు ప్రజలకు స్నేహితులేనని వారి హితం కోసమే నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ప్రతి మనిషి స్వార్థంతో కాకుండా భవిష్యత్ తరాల బాగు కోసం పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. స్టేషన్ చుట్టు టేకు మొక్కలు నాటాలని, ఆవరణ అంతా మంచి మొక్కలు నాటి గార్డెన్‌గా తీర్చిదిద్దాలని ఎస్సైకి సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ బోనాల కిషన్, ట్రైనీ ఎస్సై రామారావు, ఏఎస్సై రాజేశ్వర్, హెడ్‌కానిస్టేబుళ్లు రాఘవులు, సర్వేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement