బోధన్‌ ఆస్పత్రికి ‘జిల్లా’ హోదా!

'District' status to Bodhan Hospital - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

మెరుగుపడనున్న వైద్య సేవలు

100 పడకల నుంచి 250 పడకలకు పెంపు

ఎంపీ కవిత చొరవతో నెరవేరిన కల

బోధన్‌ టౌన్‌(బోధన్‌) నిజామాబాద్‌: బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లా ఆస్పత్రి హోదా లభించింది. బోధన్‌ వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్‌ చొరవతో బోధన్‌ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ప్రభుత్వ వైద్యం చేరువ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 25 ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే బోధన్‌కు ‘జిల్లా ఆస్పత్రి’ హోదా లభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 100 పడకల సంఖ్య 250కి పెరగనుంది. 

నెరవేరిన కల 

ఉమ్మడి జిల్లాలో జిల్లా కేంద్రానికి మెడిక ల్‌ కళాశాల మంజూరు కాగా, బోధన్‌ ఏ రియా ఆస్పత్రిని జిల్లా ఆస్పతిగా మా ర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. పదెకరాల సువిశాల స్థలం లో కొత్త భవనంతో పాటు మౌలిక వస తులు కల్పించాలని, ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని నర్సింగ్‌ స్కూల్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు. బోధన్‌ ఆస్పత్రికి జిల్లా ఆస్పత్రి హోదా వస్తుంద ని నియోజకవర్గ ప్రజలతో పాటు డివిజ న్‌ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు.

కానీ, ఏళ్ల తరబడి వారి కల నేరవేరలేదు. ఎంపీ కవిత చొరవతో తాజాగా ప్రభుత్వం జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్వ డివిజన్‌ పరిధిలో బోధన్‌ నియోజకవర్గంతో పాటు ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గ పరిధిలోని మండలా గ్రామీణ ప్రజలు వైద్య సేవలు అందించిన చరిత్ర ఏరియా ఆస్పత్రికి ఉంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా బోధన్‌ డివిజన్‌ 12 మండలాల నుంచి 7 మండలాలకు పరిమితమైంది.

ప్రస్తుతం డివిజన్‌ పరిధిలో బోధన్‌ టౌన్, రూరల్, ఎడపల్లి, రెంజ ల్, బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, రుద్రూర్, వర్ని మం డలాల ప్రజలకు ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయి. తాజా గా ప్రభుత్వం ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.రోగుల తరలింపునకు చెక్‌ బోధన్‌ ఏరియా ఆస్పత్రిలో రోజూ 500 మంది ఔట్‌ పేషెంట్స్, 100 మంది ఇన్‌పేషెంట్‌లుగా చికిత్స  పొందు తుంటారు.

బోధన్‌ పట్టణంతో పాటు బోధన్‌ రూరల్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్నితో పాటు నవీపేట్, బీర్కూర్‌ మండలాలకు చెందిన ప్రజలు ఇక్కడ వైద్య సేవలు అందుకుంటున్నారు. ఏటా సుమారు నాలుగైదు లక్షల మంది ఇక్కడ చికిత్సలు పొందుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సలు అందించాల్సిన వచ్చినప్పుడు ప్రథమ చికిత్సలు నిర్వహించి, రోగులను జిల్లా ఆస్పత్రికి మేరుగైన వైద్య సేవల నిమిత్తం తరలించాల్సిన పరిస్థితి ఉండేది.

రోగులకు అత్యవసర చికిత్సలు అందించాలనే ప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఇటీవల ఆస్పత్రిలోని ప్రసూతి వార్డును అధునాతనంగా తీర్చి దిద్దారు. దీంతో పాటు అత్యవసర చికిత్సలు అందించే సమయంలో రోగికి అవసరమైన రక్తం అందుబాటులో ఉండేందుకు ఇటీవల రక్త నిధి కేంద్రం పనులు ప్రారంభించారు. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో ప్రస్తుతం ఉన్న వంద పడకలకు తోడు మరో 150 పడకలు అందుబాటులోకి రానున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top