బల్లి పడిన ఆహారం తిని మహిళ మృతి | Diet and killed the lizard fall in khammam | Sakshi
Sakshi News home page

బల్లి పడిన ఆహారం తిని మహిళ మృతి

Nov 22 2015 4:42 PM | Updated on Sep 3 2017 12:51 PM

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

వైరా: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బల్లి పడిన ఆహారం తిని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన  వైరా మండలం పాటడుగు గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన జానకి రామయ్య కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమానం వచ్చిన వారు వంట గిన్నెలు తీసి చూడగా.. సాంబారులో బల్లి పడి ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. జానకి రామయ్య భార్య భారతమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా..జానకి రామయ్యతో పాటు కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement