స్థానికులకే ఉద్యోగాలివ్వాలి | dharna at substation in adilabad distirict | Sakshi
Sakshi News home page

స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

Feb 6 2015 7:05 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా గూడెం మండలంలోని సబ్‌స్టేషన్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని గూడెం గ్రామస్తులు శుక్రవారం సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గూడెం మండలంలోని సబ్‌స్టేషన్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని గూడెం గ్రామస్తులు శుక్రవారం సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్‌ను నిర్మించారు.

అందులో ఉద్యోగాలను కాంట్రాక్టర్ స్థానికులకు ఇవ్వకుండా బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల గ్రామస్తులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం నియమించిన ఉద్యోగులను తొలగించి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
(గూడెం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement