రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ సుందర్ అబ్నార్కు గాయాలయ్యాయి.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మామిడ మండలం ముండిగుట్ట సమీపంలో సోమవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు..హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశాన్ని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఆదిలాబాద్ జిల్లా జేసీ సుందర్ అబ్నారీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈప్రమాదంలో ఆయనకు తీవ్రగాయలు కాగా, డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి.
గాయపడిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.