రిటర్న్‌ టు హోం | Crisis in Qatar | Sakshi
Sakshi News home page

రిటర్న్‌ టు హోం

Jul 30 2017 2:43 AM | Updated on Sep 5 2017 5:10 PM

ఖతర్‌లో ఏర్పడిన సంక్షోభ ప్రభావం తెలంగాణ కార్మికులపై పడుతోంది.

ఖతర్‌లో సంక్షోభం 
- వెనుదిరిగిన కార్మికులు
 
మోర్తాడ్‌ (బాల్కొండ): ఖతర్‌లో ఏర్పడిన సంక్షోభ ప్రభావం తెలంగాణ కార్మికులపై పడుతోంది. పొట్ట చేతపట్టుకొని అక్కడికి వెళ్లిన కార్మికులు ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణకు చెందిన సుమారు ఆరు వందల మంది ఖతర్‌ నుంచి ఇళ్లకు తిరిగి వచ్చారు. ఇంకా, చాలామంది కార్మికులు కొద్ది రోజుల్లోనే ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని ఇటీవల ఖతర్‌ నుంచి తిరిగి వచ్చిన కార్మికులు చెబుతున్నారు.

 తీవ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో ఖతర్‌పై తోటి గల్ఫ్‌ దేశాలు ఆంక్షలను విధించి, సహాయ సహకారాలను నిలిపివేయటంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా, ఖతర్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఆర్థికభారం పడటంతో కంపెనీలను నిర్వహించడం సాధ్యం కాదని యాజమాన్యాలు కార్మికులను పనుల నుంచి తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వీసా గడువు ముగిసిపోయినా రెన్యువల్‌ చేయకుండా ఇంటికి పంపిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement