నేటి నుంచి చిలుకూరు ఆలయం బంద్‌

Covid 19: Chilkur Balaji Temple To Remain Shut Down - Sakshi

మొయినాబాద్‌ (చేవెళ్ల): తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయంపై కోవిడ్‌ వైరస్‌ ప్రభావం పడింది. ఈ నెల 19 నుంచి 25 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్‌ బుధవారం ప్రకటించారు. కోవిడ్‌ ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి రోజూ చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు బాగానే వస్తున్నారని ఆయన చెప్పారు. బాలాజీ ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఎక్కువ సమయం ఉంటున్నారని, దీని వల్ల వైరస్‌ సోకే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. కొంత మంది భక్తులు విదేశాల నుంచి నేరుగా ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారని అలాంటి వారిని ప్రత్యేకంగా గుర్తించలేమని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రోజు మాదిరిగా నిత్యం స్వామివారికి అభిషేకం, పూజలు, అర్చన, ఆరాధన జరుగుతాయని.. కానీ భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం ఉండదని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top