ముస్లింలకు కాంగ్రెస్‌ ఇఫ్తార్‌ విందు | Congress Iftar Dinner for Muslims in Telangana | Sakshi
Sakshi News home page

ముస్లింలకు కాంగ్రెస్‌ ఇఫ్తార్‌ విందు

Jun 13 2018 1:12 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Iftar Dinner for Muslims in Telangana - Sakshi

మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ప్రసంగిస్తున్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌. చిత్రంలో భట్టి విక్రమార్క, జానారెడ్డి, ముస్లిం నేతలు తదితరులు

హైదరాబాద్‌: రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇచ్చింది. నాంపల్లిలోని రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌ హాలులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన సాగిన ఈ విందుకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ భట్టి విక్రమార్క, శాసన సభాపక్ష నేత జానా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, సీనియర్‌ నాయ కులు మర్రి శశిధర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రవణ్‌ కుమా ర్, షేక్‌ అఫ్జలుద్దీన్, మల్‌రెడ్డి రంగారెడ్డి, జాఫర్‌ జావేద్, ఆమేర్‌ జావేద్, ఖలీఖుర్‌ రెహ్మాన్, ఖాజా ఫకృద్దీన్, మాజీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఖాజా ఖలీలుల్లా, అంజన్‌కుమార్‌ యాదవ్, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement