భద్రకాళీ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు
శ్రీ భద్రకాళీ అమ్మ వారికి సీఎం కేసీఆర్ మొక్కును చెల్లించుకున్నారు.
వరంగల్ : ఓరుగల్లు శ్రీ భద్రకాళీ అమ్మ వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు మొక్కును చెల్లించుకున్నారు. రూ.3.70కోట్ల విలువైన 11 కిలోల 700 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు.
ఆదివారం ఉదయం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయాధికారులు, వేద పండితులు సీఎంకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పలు ఆలయాల్లో దేవుళ్లకు నగలు సమర్పిస్తానని సీఎం మొక్కుకున్న విషయం తెలిసిందే.