
సాక్షి, గంగాధర(కరీంనగర్) : ప్రజా సమస్యల పరిష్కారం, పలు అభివృద్ధి కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన వ్యవసాయ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలోని పొలంలో వరి సాగు పనుల్లో పాల్గొన్నారు. పొద్దున్నే పొలంలోకి ఎడ్లబండిపై నారు జారవేశారు. అనంతరం పొలంలో నారు పంచి వేశారు. ఎమ్మెల్యే పొలం పనులు చేయడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.