వారికి క్వారంటైన్‌ లేదు: సోమేశ్ ‌కుమార్‌

Chief Secretary Somesh Kumar Visits Hyderabad Airport - Sakshi

సాక్షి, తెలంగాణ: కేంద్ర పౌరవిమానయాన మార్గదర్శకాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్‌గాంధీ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి కూడా డొమెస్టిక్‌ ఫ్లైట్స్‌ ప్రారంభమైనట్లు తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం రోజున  ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల ఆరోగ్యంపై పలు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రయాణికుల్ని టచ్‌ చేయకుండా సెన్సార్‌లు కూడా ఏర్పాటు చేశాం. ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రయాణాల్ని సాగించే ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరి. ఆరోగ్య సేతు యాప్‌  ఉన్న వాళ్లనే లోపలికి అనుమతిస్తున్నాం. చదవండి: రెడ్‌ అలర్ట్‌: ఆ సమయంలో బయటకు రావొద్దు 

ఇవాళ రాజీవ్‌గాంధీ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి 19 ఫ్లైట్స్‌ రావడం మరో 19 ఫ్లైట్స్‌ వెళ్లడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా ఎయిర్‌ పోర్ట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నాం. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్‌ లేదు. 1600 మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కి వస్తున్నట్లు' సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

చదవండి: ఏపీలో మరో 44 కరోనా కేసులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top