చార్మినార్‌ను చూసేందుకు వచ్చిన ఓ సందర్శకుడు అదృశ్యమైన ఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
బహదూర్‌పురా : చార్మినార్‌ను చూసేందుకు వచ్చిన ఓ సందర్శకుడు అదృశ్యమైన ఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం...గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన అరబ్ మహ్మద్ హుస్సేనీ కాలాపత్తర్‌లో నివాసం ఉండే సోదరుడి ఇంటికి తండ్రి హుస్సేనీ మహ్మద్ (51)తో కలిసి ఈనెల 6న వచ్చాడు. 7న కుమారుడితో కలిసి హుస్సేనీ మహ్మద్ చార్మినార్ సందర్శనకు వెళ్లాడు.
చార్మినార్ సందర్శన పూర్తయ్యాక 2.30 గంటలకు సమీపంలోని పాన్‌షాప్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుమారుడు చార్మినార్ చుట్టు పక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో తన తండ్రి హుస్సేనీ మహ్మద్ కనిపించడంలేదంటూ కుమారుడు గురువారం హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.