'ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదు' | chandana deepti narrates mominpet rape incident | Sakshi
Sakshi News home page

'ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదు'

May 24 2015 1:16 PM | Updated on Mar 28 2018 11:08 AM

'ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదు' - Sakshi

'ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదు'

గిరిజన బాలికపై కన్నతండ్రే అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన హృదయాన్ని కలచివేసిందని రంగారెడ్డి జిల్లా ఏఎస్పీ చందనా దీప్తి అన్నారు.

వికారాబాద్: గిరిజన బాలికపై కన్నతండ్రే అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన హృదయాన్ని కలచివేసిందని రంగారెడ్డి జిల్లా ఏఎస్పీ చందనా దీప్తి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఓ తండ్రి ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇది చాలా అమానుషమైన చర్య అని పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు.

మెగావత్ కమాల్ మృగంలా ప్రవర్తించాడని,  మనిషినన్న సంగతి మర్చిపోయాడని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వం మీద ఒక్కసారిగా అపనమ్మకం ఏర్పడుతుందన్నారు. మగవారిని 100 శాతం నమ్మొద్దని ఆమె సూచించారు. మహిళలు, అమ్మాయిలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలన్నారు.  24 గంటల్లోనే కేసును ఛేదించినందుకు గర్వంగా ఉందని చందనా దీప్తి చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే సమాజంలో మార్పు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన గిరిజన బాలిక సిమ్రాన్(14)పై కన్నతండ్రే అత్యాచారం చేసి, హత్య చేసినట్టు తేలడం పోలీసులతో పాటు అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement