యాదగిరీశుడికి చక్రస్నానం | chakra snanam conducted to sri laxminarasimha swamy | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడికి చక్రస్నానం

Mar 1 2015 7:05 PM | Updated on Sep 2 2017 10:08 PM

యాదగిరీశుడికి చక్రస్నానం

యాదగిరీశుడికి చక్రస్నానం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అర్చకులు స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు.

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అర్చకులు స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రాలను ధరింపచేశారు. పుష్పాలతో శోభాయమానంగా అలంకారించి, మహా పూర్ణాహుతి నిర్వహించారు. 10 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను వీక్షించిన దేవతలకు హవనం ద్వారా నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement