కళ్లల్లో కారం కొట్టి లాక్కెళ్లాడు.. | Chain snatching in Hyderabad | Sakshi
Sakshi News home page

కళ్లల్లో కారం కొట్టి లాక్కెళ్లాడు..

Oct 20 2015 6:35 PM | Updated on Sep 4 2018 5:07 PM

కళ్లల్లో కారం కొట్టి ఓ మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన సంఘటన చిక్కడపల్లి పరిధిలోని రామ్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

హైదరాబాద్ : కళ్లల్లో కారం కొట్టి ఓ మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన సంఘటన చిక్కడపల్లి పరిధిలోని రామ్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. రామ్‌నగర్‌లో స్మిత(32) అనే మహిళ షాప్‌లో ఉండగా మాస్క్ ధరించి వచ్చిన ఓ యువకుడు ఆమె కళ్లల్లో కారం కొట్టాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల మంగళసూత్రం తెంచుకెళ్లాడు.

బాధిత మహిళ గట్టిగా అరవటంతో షట్టర్ మూసి పరారయ్యాడు. ఈ సంఘటన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటికి కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement