ఇరవై రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రహసనం ఆదివారంతో ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లలో నిక్షిప్తమై ఉంది.
మెదక్, న్యూస్‌లైన్: ఇరవై రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రహసనం ఆదివారంతో ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లలో నిక్షిప్తమై ఉంది. ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు ఈవీఎంలను మెదక్ పట్టణంలోని గోల్‌బంగ్లాకు తరలించారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలో భద్రం చేశారు.
ఇక పోలింగ్ ముగిసిన వెంటనే అభ్యర్థులు తమ కార్యకర్తలతో సమావేశమై కూడికలు, తీసివేతలతో విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలన చేస్తూ..గెలుపోటములపై అంచనాలకు వస్తున్నారు. ఏప్రిల్ 2న కౌటింగ్ జరపాల్సి ఉన్నప్పటికీ మంగళవారం నాటి హైకోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఓట్ల లెక్కింపు 2న జరుగుతుందా? లేక వాయిదా పడుతుందా? అన్న టెన్షన్ అభ్యర్థులు, ప్రజల్లో నెలకొంది.
సోమవారం పట్టణంలో ఎక్కడ చూసినా ఎన్నికల జయాపజయాలపైనే చర్చించుకోవడం కనిపించింది. సోమవారం ఉగాది పర్వదినం కావడంతో అ భ్యర్థులు సాయంత్రం వేళలో జరిగిన ప ంచాం గ శ్రవణానికి హాజరై తమ భవిష్యత్ జాతకాన్ని పండితుల ద్వారా చెప్పించుకున్నారు. అధికారులు మాత్రం ఏ క్షణంలోనైనా కౌటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.