కాలువలో పడ్డ బస్సు.. 40 మందికి గాయాలు | bus slipped and 40 injured | Sakshi
Sakshi News home page

కాలువలో పడ్డ బస్సు.. 40 మందికి గాయాలు

Jun 16 2015 8:23 PM | Updated on Sep 3 2017 3:50 AM

వేగంగా వెళ్తున్న బస్సు లారీని ఢీకొని కాలువలో పడ్డ సంఘటనలో 40 మందికి గాయాలయ్యాయి.

మహబూబ్‌నగర్: వేగంగా వెళ్తున్న బస్సు లారీని ఢీకొని కాలువలో పడ్డ సంఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని దేవరకద్ర-చింతకుంట మధ్య గల బండర్‌పల్లి వంతెనపై మంగళవారం రాత్రి జరిగింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు లారీని ఢీకొని కాలువలో పడింది. కాలువ ఎక్కువ లోతు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement