కాలేజీ బస్సు బోల్తా... 26 మందికి గాయాలు | students injured in privatecollege bus slipped incident | Sakshi
Sakshi News home page

కాలేజీ బస్సు బోల్తా... 26 మందికి గాయాలు

Feb 26 2016 8:09 AM | Updated on Nov 9 2018 4:44 PM

ఓ ప్రైవేట్ కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

దువ్వూరు: ఓ ప్రైవేట్ కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం టంగుటూరుమెట్ట సమీపంలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన రాయలసీమ వ్యాయామ కళాశాల విద్యార్థులు మూడు బస్సుల్లో విహార యాత్రలో భాగంగా అహోబిలం వెళుతున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున దువ్వూరు మండలం టంగుటూరుమెట్ట వద్ద గొర్రెల మందను తప్పించే క్రమంలో ఇందులోని ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 26 మంది విద్యార్థులకు గాయాలు కాగా వీరికి చికిత్స అందించేందుకు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement