
యువకుడి దారుణ హత్య
మండలంలోని నూకపల్లి శివారులో బుధవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యూడు...
- గొంతుకోసి చంపిన వైనం
- స్నేహితులపైనే అనుమానం?
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మల్యాల : మండలంలోని నూకపల్లి శివారులో బుధవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యూడు. గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నారు. హత్యాస్థలాన్ని పరిశీలిస్తే కొద్ది సేపు పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్నేహితులే చంపారని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ విజయ్‌రాజ్, ఎస్సైలు శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్ గురువారం పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో దర్యాప్తు చేపట్టారు.
సంఘటన స్థలంలో వైద్యుడి రాసిన చీటితోపాటు, రెండు ద్విచక్ర వాహనాల తాళం చెవులు లభించాయి. మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి జేబులోని వైద్యుడి చీటి ప్రకారం కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన అఖిలేశ్‌రావు(25)గా గుర్తించినట్లు జగిత్యాల సీఐ విజయ్‌రాజ్ చెప్పారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్నేహితులే హంతకులా?
తన స్నేహితుల దగ్గరకు వెళ్తున్నానని బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడని మృతుడి తండ్రి సత్యనారాయణ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల దాటిన ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చినట్లు తెలిపారు. అరుుతే సంఘటన స్థలానికి వచ్చిన మృతుడి మరో మిత్రుడు మాట్లాడుతూ తనకు రాత్రి ఫోన్ చేసి.. తన ఫ్రెండ్స్‌తో మద్యం సేవించానని, గొడవ అవుతుందని చె ప్పినట్లు పేర్కొన్నారు. అరుుతే దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం సాయంత్రం ప్రధాన రహదారిపై వెళ్లిన వాహనాల సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతుడి స్నేహితుల వివరాలు ఆరా తీస్తున్నారు.
వరద కాలువ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
వరద కాలువ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మూడేళ్ల క్రితం కోరుట్ల మండలం కల్లూరుకు చెందిన ఓ వివాహితను హత్య చేసి ఇక్కడే పడేశారు. నూకపల్లి అర్బన్‌హౌసింగ్ శివారులోని మామిడితోటల్లో జగిత్యాల మండల నర్సింగాపూర్‌కు చెందిన యువకుడిన దారుణంగా హత్య చేశారు. పోలీసుల నిఘా కరువవడంతో వరదకాలువ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.