విద్యార్థుల హాజరుకు ఇక బయోమెట్రిక్‌ | BioMetric System In Govt Schools | Sakshi
Sakshi News home page

విద్యార్థుల హాజరుకు ఇక బయోమెట్రిక్‌

Jun 4 2018 1:19 AM | Updated on Jun 4 2018 1:19 AM

BioMetric System In Govt Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బయోమెట్రిక్‌ పద్ధతిలో విద్యా ర్థుల హాజరు నమోదుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) సంస్థ రూపొందించిన ‘అబాస్‌’ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాంను ఇందుకు ఉపయోగించ నున్నారు. ఆధార్‌ అనుసంధానం ద్వారా బయో మెట్రిక్‌ పద్ధతిలో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు పాఠశాలల్లో ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రంలోని పదివేల పాఠ శాలల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది. 4 సెకండ్ల వ్యవధిలో ఓ విద్యార్థి హాజరును ఈ సాఫ్ట్‌వేర్‌ నమోదు చేయనుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాధికారి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తమ కంప్యూటర్లు/లాప్‌టాప్‌ తెరల మీద విద్యార్థుల హాజరుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు తెలుసుకోవడానికి దీని ద్వారా వీలు కలగ నుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంపై విశ్లేషణలు జరపడంతో పాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement