శీలానికి వెల కట్టిన పెద్దలపై కేసు | bigwigs of villages costs girl arrested | Sakshi
Sakshi News home page

శీలానికి వెల కట్టిన పెద్దలపై కేసు

May 8 2016 3:02 AM | Updated on Sep 3 2017 11:37 PM

శీలానికి వెల కట్టిన పెద్దలపై కేసు

శీలానికి వెల కట్టిన పెద్దలపై కేసు

ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం పల్లంగూడకి చెందిన బాలికను గర్భవతిని చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అత్యాచార నిందితుల అరెస్టు
మందమర్రి రూరల్: ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం పల్లంగూడకి చెందిన బాలికను గర్భవతిని చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాలిక శీలానికి వెలకట్టిన 20 మంది పం చాయతీ పెద్దలపై కేసు నమోదు చేశారు.  వివరాలను మందమర్రిలో బెల్లంపల్లి డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. పల్లంగూడకు చెందిన బాలిక(15)ను పాఠశాలకు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ చిర్రకుంట మహేందర్, అతడి మిత్రులు అటుకపురపు విజయ్‌కుమార్, తాల్లపల్లి సంతోశ్, నీతుల ప్రశాంత్, మహేందర్ తండ్రి చిర్రకుంట లక్ష్మయ్య ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.

బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. కుటుంబసభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించగా.. నిందితులకు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయించారు. ఇందుకు అంగీకరించని బాలిక తల్లిదండ్రులు ఈ నెల 5న దేవాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీ సులు నిందితులను అరెస్టు చేశారు.

పంచాయితీ చెప్పిన 20 మంది పెద్ద మనుషులు రంగు లక్ష్మయ్య, బొద్దుల రాజబాబు, కురుపతి ముత్తయ్య, ఆరెపల్లి బాపు, తాల్లపల్లి బాపు, పత్తిపాక శ్రీనివాస్, తాండూరి మహేందర్, సింగం సురేశ్, గొడిసేల రాములు, చిందం రాజబాబు, నేతుల శ్రీధర్, తాల్లపల్లి రంజిత్, తాల్లపల్లి స్వామి, రంగు రమేశ్, దుస్సా శ్రీనివాస్, కొండ రాజ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు, విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు 20 మంది గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఐదుగురు నింది తులపై నిర్భయతోపాటు పలు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement