మెరిసిన‘మెహరా’ | bhanu sri mehra in new shopping mal | Sakshi
Sakshi News home page

మెరిసిన‘మెహరా’

Jul 11 2014 2:52 AM | Updated on Sep 2 2017 10:06 AM

మెరిసిన‘మెహరా’

మెరిసిన‘మెహరా’

న్యూటౌన్‌లో ప్రముఖ కే 6000 ఫ్యామిలీ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించా రు.

మహబూబ్‌నగర్ కల్చరల్: న్యూటౌన్‌లో ప్రముఖ కే 6000 ఫ్యామిలీ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పురుషుల వస్త్రాల విభాగాన్ని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, మొదటి అంతస్తులోని లేడీస్ రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ శారీస్ మాల్‌లకు భానుశ్రీ మెహరా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి మహానగరాల  స్థాయిలో ఆధునిక వస్త్ర దుకాణాన్ని కే 6000 యాజమాన్యం అక్కడే ప్రారంభించడం అభినందనీయమన్నారు. పెళ్లిళ్లు తదితర శుభకార్యాలకు కావాల్సిన వస్త్రాలకు హైదరాబాద్ తదితరర పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే కొనుగోలుచేయొచ్చన్నారు.

షాపింగ్‌మాల్‌ను ప్రారంభించేందుకు వస్తున్న తమ అభిమాన హీరోయిన్ భానుశ్రీ మోహరాను చూసేందుకు అభిమానులు ఉదయం 9 గంటలకే వచ్చారు. అభిమానులు ఆమెకు ఇబ్బందులు కలిగించకుండా షాపు యాజమాన్యం ప్రైవేట్ బౌన్సర్లతోపాటు స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నారు. అనంతరం మోడల్స్ నిర్వహించిన ఫ్యాషన్ షో పలువుని ఆకట్టుకుంది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు మోసీన్‌ఖాన్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమూద్, ఎక్బాల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్‌రాజు, షాపింగ్ మాల్ యజమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement