breaking news
Newtown
-
Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
కోల్‌కతా/ఢాకా: చికిత్స కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఆవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతాలోని న్యూటౌన్ లగ్జరీ అపార్ట్మెంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్ నేత హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్‌గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్‌చేశారు. కోల్కతాకొచ్చి కనిపించకుండాపోయి..మే 12వ తేదీన ఎంపీ అన్వర్ నార్త్ కోల్‌కతాలోని బారానగర్‌లో తనకు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి అన్వర్ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్‌కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్ ఫోన్ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్ చివరిసారిగా సంజీబ్ ఘోష్‌కు చెందిన అపార్ట్మెంట్లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్ రాలేదు. అన్వర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్ అనుమానం వ్యక్తంచేశారు. -
మెరిసిన‘మెహరా’
మహబూబ్‌నగర్ కల్చరల్: న్యూటౌన్‌లో ప్రముఖ కే 6000 ఫ్యామిలీ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పురుషుల వస్త్రాల విభాగాన్ని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, మొదటి అంతస్తులోని లేడీస్ రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ శారీస్ మాల్‌లకు భానుశ్రీ మెహరా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి మహానగరాల స్థాయిలో ఆధునిక వస్త్ర దుకాణాన్ని కే 6000 యాజమాన్యం అక్కడే ప్రారంభించడం అభినందనీయమన్నారు. పెళ్లిళ్లు తదితర శుభకార్యాలకు కావాల్సిన వస్త్రాలకు హైదరాబాద్ తదితరర పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే కొనుగోలుచేయొచ్చన్నారు. షాపింగ్‌మాల్‌ను ప్రారంభించేందుకు వస్తున్న తమ అభిమాన హీరోయిన్ భానుశ్రీ మోహరాను చూసేందుకు అభిమానులు ఉదయం 9 గంటలకే వచ్చారు. అభిమానులు ఆమెకు ఇబ్బందులు కలిగించకుండా షాపు యాజమాన్యం ప్రైవేట్ బౌన్సర్లతోపాటు స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నారు. అనంతరం మోడల్స్ నిర్వహించిన ఫ్యాషన్ షో పలువుని ఆకట్టుకుంది. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు మోసీన్‌ఖాన్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమూద్, ఎక్బాల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్‌రాజు, షాపింగ్ మాల్ యజమానులు పాల్గొన్నారు.