‘జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం’ | "BC movement at the national level ' | Sakshi
Sakshi News home page

‘జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం’

Jun 9 2018 1:37 AM | Updated on Jun 9 2018 1:37 AM

"BC movement at the national level ' - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసినట్లు బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల ప్రతినిధులు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామిని కలిశారు.

బీసీల సమస్య లపై  గంటన్నరపాటు చర్చించారు. బీసీలకు చట్టసభలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లతో పాటు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌పై జాతీయ స్థాయిలో ఉద్యమం మొదలు పెట్టామని, ఇందులో భాగంగా పుదుచ్చేరి సీఎంని కలిశా మని కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం చేసిన ప్రతిపాదనలపై సీఎం నారాయణ స్వామి సానుకూలంగా స్పందించారని, వచ్చే వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement