ఐడీఎల్ ఘటనలో మరొకరి మృతి | Another died in IDL incident | Sakshi
Sakshi News home page

ఐడీఎల్ ఘటనలో మరొకరి మృతి

Feb 27 2015 11:49 PM | Updated on Sep 2 2017 10:01 PM

బాలానగర్‌లోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)లో ఈనెల 23న జరిగిన పేలుడులో గాయపడ్డ మరో వ్యక్తి చికిత్స..

హైదరాబాద్‌సిటీ: బాలానగర్‌లోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)లో ఈనెల 23న జరిగిన పేలుడులో గాయపడ్డ మరో వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఖైరతాబాద్ డివిజన్ న్యూసీఐబీ క్వార్టర్స్‌లో నివాసముండే కృష్ణస్వామి (59) ఆ రోజు జరిగి ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న కృష్ణస్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ విషయం తెలిసి ఖైరతాబాద్‌లోని న్యూసీఐబీ క్వార్టర్స్ పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య లక్ష్మీబాయి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, కృష్ణస్వామి మృతితో గల్ఫ్ ఆయిల్’ ప్రమాదంలో గాయపడి మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement