ఆక్యుపెన్సీ లేదని ఆపేశారు..! | Andhra pradesh RTC officers stopped to give Occupancy for RTC buses | Sakshi
Sakshi News home page

ఆక్యుపెన్సీ లేదని ఆపేశారు..!

Jun 6 2014 4:29 AM | Updated on Sep 27 2018 5:59 PM

ఆక్యుపెన్సీ లేదని ఆపేశారు..! - Sakshi

ఆక్యుపెన్సీ లేదని ఆపేశారు..!

రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర సరిహద్దుల్లో తెలంగాణ పల్లెలకు బస్సు కష్టాలు ప్రారంభవుయ్యూరుు.

* తెలంగాణ పల్లెలకు ఆంధ్ర సర్వీసులు రద్దుచేస్తున్న అధికారులు
* ఇప్పటికే మహబూబ్‌నగర్ గ్రామాలకు నిలిచిపోయిన ‘పల్లెవెలుగు’
* భవిష్యత్‌లో పర్మిట్ భారం కానుందని ఆందోళన
* సొంతరాష్ట్రం పల్లెలకు నడపాలని నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీవూంధ్ర సరి హద్దుల్లో తెలంగాణ పల్లెలకు బస్సు కష్టాలు ప్రారంభవుయ్యూరుు. ఇంతకాలం సీవూంధ్ర ప్రాంతం నుంచి ఆయూ పల్లెలకు నడుస్తున్న బస్సు సర్వీసులను నిలిపివేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణం. కర్నూలు సరిహద్దుల్లోని  మహబూబ్‌నగర్ జిల్లా, గోదావరి జిల్లాను ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లా... కృష్ణా, గుంటూరుల సమీపంలోని నల్లగొండ జిల్లాల్లోని గ్రామాలకు సీవూంధ్ర నుంచి దాదాపు 700 బస్సులు నడిచేవి.
 
 భౌగోళికంగా తెలంగాణలో ఉన్న ఈ గ్రావూల ప్రజలు రోజువారీ అవసరాల కోసం చేరువలోని సీవూంధ్ర పట్టణాలపై ఆధారపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఉవ్ముడి రాష్ట్రంలో ఆర్టీసీ ఆయూ ప్రాంతాలకు ఎక్కువగా బస్సు సర్వీసులను ఏర్పాటుచేసింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే బస్సులకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చే బస్సుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఈ సర్వీసులను నిలిపివేసేందుకు సన్నాహాలు జరుగుతుండటంతో పల్లెవాసులు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు.
 
 ఇవీ కారణాలు...
 ఆర్టీసీ ప్రస్తుతం రెండు ప్రాంతాల్లోనూ నష్టాల్లో ఉంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఆర్టీసీకి నష్టాలు అధికంగా ఉన్నారుు. రెండు రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో అంతర్‌రాష్ట్ర నిబంధనలు తెరపైకి వస్తాయి. వీటి ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సులకు సంబంధించి పర్మిట్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కిలోమీటరుకు రూ.2.50 నుంచి గరిష్టంగా రూ.6 వరకు చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ పట్టణాల నుంచి పొరుగునే ఉన్న తెలంగాణ పల్లెలకు నడిచే బస్సులు మొత్తం ప్రయాణంలో సింహభాగం తెలంగాణ భూభాగంలో తిరుగుతాయి. దీంతో పర్మిట్ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నష్టాలను పెంచుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోయినా... ఏడాది వరకు పర్మిట్ బెడద ఉండనప్పటికీ ఆ తర్వాత భారం తప్పదనేది వారి వాదన.
  చాలా తెలంగాణ ప్రాంతాలకు నడిచే బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఆశించినంత లేదు. ప్రజల అవసరాల దృష్ట్యా బస్సులు నడపాల్సి వస్తోంది. ఈ ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు వాటిని మళ్లిస్తే ఆదాయం ఎక్కువగా ఉంటుందని అధికారులు నివేదికలు రూపొందించారు.
 
  ఆర్టీసీ విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు, కార్మికుల మధ్య భావోద్వేగాలపరంగా అగాధం పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ఉండొద్దని తెలంగాణ సిబ్బంది ఓ దశలో సమ్మెకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సుల్లోని సిబ్బంది విషయంలో కొందరు సీమాంధ్ర సిబ్బంది దురుసుగా వ్యవహరించిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని బస్టాండ్లలో తెలంగాణ బస్సులకు పార్కింగ్ వసతి కల్పించటం లేదు. ఇది కూడా బస్సుల రద్దుపై ప్రభావం చూపింది.
  ఇప్పటికే కర్నూలు - మహబూబ్‌నగర్ మధ్య కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. గుంటూరు- నల్లగొండ ప్రాంతంలో సర్వీసుల సంఖ్యను బాగా తగ్గించారు.

Advertisement
 
Advertisement
Advertisement