‘ఆటా తెలంగాణ’ నూతన కార్యవర్గం ఎన్నిక

American Telangana Association New Executives was elected - Sakshi

చైర్మన్‌గా మాధవరం కరుణాకర్‌

అధ్యక్షుడిగా వినోద్‌ కుకునూరు

సాక్షి, హైదరాబాద్‌: అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని అమెరికాలోని డెట్రాయిట్‌ నగరంలో ఇటీవల జరిగిన బోర్డ్‌ మీటింగ్‌లో ఎన్నుకున్నారు. చైర్మన్‌గా మాధవరం కరుణాకర్, అధ్యక్షుడిగా వినోద్‌ కుకునూరు ఎంపికయ్యారు. ఈ సమావేశంలో 25 అంశాలపై 8 గంటల పాటు చర్చ జరిపారు. ఇక నుంచి అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ను క్లుప్తంగా ‘ఆటా తెలంగాణ’గా పిలవాలని బోర్డు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆటా తెలంగాణ పేరునే ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆటా తెలంగాణ అధ్యక్షుడిగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను వినోద్‌ వివరించారు. నూతన కార్యవర్గం జూన్‌ 2019 నుంచి డిసెంబర్‌ 2020 వరకు పనిచేస్తుందని చెప్పారు. తదుపరి సమావేశం సెప్టెంబర్‌ 7న ఫ్లోరిడాలో జరుగుతుందని తెలిపారు. కాగా, తన రెండేళ్ల పదవీ కాలంలో ఆటా తెలంగాణ తరఫున అమెరికా, ఇండియాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలను బోర్డు పాస్ట్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణరెడ్డి కందిమళ్ల వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top