సచివాలయ కూల్చివేత పనులు వేగవంతం | Again Starts Telangana Secretariat Demolition work After Court Gave Permission | Sakshi
Sakshi News home page

రెండ్రోజుల్లో సచివాలయం కూల్చివేత పూర్తి

Jul 17 2020 7:58 PM | Updated on Jul 17 2020 9:16 PM

Again Starts Telangana Secretariat Demolition work After Court Gave Permission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు వేగవంతం కానున్నాయి. తెలంగాణ కూల్చివేతను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సచివాలయం కూల్చివేతకు శుక్రవారం అనుమతినిచ్చింది. కోర్టు అనుమతి నేపథ్యంలో కూల్చివేత పనులను ప్రభుత్వం తిరిగి శనివారం(జూలై 18) నుంచి ప్రారంభిచనుంది.

కూల్చివేత ప్రక్రియను వేగవంతం చేసిన రెండ్రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే సచివాలయం ఏ, బీ, సీ, డీ, జీ బ్లాక్‌ల పవర్‌ రూంలను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన భవనాలను కూడా కూల్చివేసిన తర్వాతే వ్యర్థాలను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement