పోలీసుల వేధింపులతో.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Accused man attempt to suicide at Kotthuru police station | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులతో.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Mar 6 2015 2:52 PM | Updated on Sep 2 2017 10:24 PM

పోలీసుల వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కొత్తూరు(మహాబూబునగర్): పోలీసుల వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మహాబూబునగర్ జిల్లా కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. వివరాలు..మండలంలోని రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తాటిగడ్డ తండాకు చెందిన ఆనంద్‌నాయక్‌ను పోలీసులు ఒక హత్య కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. అదే గ్రామానికి చెందిన కిషన్ నాయక్ ఎనిమిది నెలల క్రితం హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో పోలీసులు ఆనంద్‌నాయక్‌ను అదపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

విచారణ సమయంలో పోలీసుల వేధింపులకు తాళలేకపోయిన ఆనంద్‌నాయక్ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్టేషన్ ముందు ఉన్న ట్రాన్స్‌పార్మర్‌ను పట్టుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు తక్షణ వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్ ముందు గొడవకు దిగారు. గ్రామస్తులకు ఈ విషయం తెలియడంతో పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలివస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు స్టేషన్ వద్ద భారీ బలగాలను మోహరించారు.

Advertisement

పోల్

Advertisement