కొనుగోలుకు సంబంధించిన బిల్లులు లేకుండా రైలులో పెద్దమొత్తంలో బంగారం తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: కొనుగోలుకు సంబంధించిన బిల్లులు లేకుండా రైలులో పెద్దమొత్తంలో బంగారం తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రోజు మాదిరిగానే ప్రయాణికుల లగేజీలను రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుండగా వరంగల్‌కు చెందిన గడ్డం రాజు (35) అనే ప్రయాణికుడి సంచిలో 4.3 కిలోల బంగారు కడ్డీలు, ఆభరణాలు బయట పడ్డాయి. వీటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు.