హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి, 17మంది అరెస్ట్ | 17 held in Hookah Parlours in Hyderabad | Sakshi
Sakshi News home page

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి, 17మంది అరెస్ట్

Dec 29 2014 10:37 PM | Updated on Sep 2 2017 6:55 PM

నగరంలోని పలు హుక్కా సెంటర్లు నిబంధనలు పాటించడంలేదని ఇటీవల ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

హైదరాబాద్: నగరంలోని పలు  హుక్కా సెంటర్లు నిబంధనలు పాటించడంలేదని ఇటీవల  ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా గడిచిన రెండు నెలల కాలంలో హుక్కా సెంటర్లపై 40 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
తాజాగా హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో అనుమతి లేకుండా నడుపుతున్న హుక్కా సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు సోమవారం దాడులు జరిపారు.

ఈ దాడుల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించినట్టు తెలిపారు. పట్టబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement