విద్యార్థి అదృశ్యం | 10 th class student Disappear in rangareddy district | Sakshi
Sakshi News home page

విద్యార్థి అదృశ్యం

Jun 7 2015 6:50 PM | Updated on Nov 9 2018 5:02 PM

ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండాపోయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండాపోయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్ ప్రాంతంలో నివాసముండే నిలేష్ కుమారుడు శంకర్(17) స్థానికంగా 10 వతరగతి చదువుతున్నాడు. అతడు ఈ నెల 3వ తేదిన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement