breaking news
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. శుక్రవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు. కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు. మోదీ.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో బీఆర్ఎస్ను చేర్చుకొలేదు. ఎటుకాని బీఆర్ఎస్ను పార్టీని ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటాం. ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పక్క దారులు చూసుకుంటున్నారు. పొత్తులు అనేది కేసీఆర్ సృష్టి’’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. గొర్రెలు, కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముందు బీజేపీ నేతలు వెళ్లి చూశారు.. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశాం. రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఎలా రాబడతారు?. కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతి పై మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కేఆర్ఎంబీపై మాట్లాడుతుంది. మాకు రాముడు, మోదీ ఉన్నారు. రజాకార్లు, ఎంఐఎం పార్టీలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు ఉన్నారు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కాంగ్రెస్ - బీజేపీ మధ్యే పోటీ. దొంగ ఓట్లను తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంట్లో కూడా గెలుస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే... కాంగ్రెస్ పార్టీ నుంచి షిండేలు వస్తారు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పని చేయలేని వాళ్లు తప్పుకోండి -
Updates: సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana Assembly Budget Session 2024 Last Day Updates తీర్మానం ఫలవంతం కావాలంటే చట్టభద్దత తేవాలి: మాజీ మంత్రి కేటీఆర్ ఓబీసీ శాఖ, జస్టిస్ సచార్ కమిషన్ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉంది. మేము ప్రయత్నం చేశాం.. న్యాయపరమైన చిక్కులు అడ్డు వచ్చాయి\ మీరు ఎన్నికల్లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు కావాలంటే సభ పొడిగించి బిల్లు పెట్టండి. మమ్మల్ని బీజేపీ బి-టీమ్ అంటున్నారు: అక్బరుద్దీన్ఓవైసీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది. ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు ఇస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్లకు సహకరించాము బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లు అంటారు. మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మమ్ములను బీజేపీ బి - టీమ్ అంటున్నారు. అసెంబ్లీ పనితీరుపై అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం 13వ తేదీ వరకు BAC పెట్టారు... తరువాత బిజినెస్ గురించి BAC పెట్టలేదు. కుల గణన పై ఎన్నికల హామీ ఇవ్వలేదు అయినా సభలో తీర్మానం చేస్తున్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తీర్మానం చేయండి. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలి. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగింది? నేను ఈ తీర్మానంకు మద్దతు ఇస్తున్నాం కానీ క్లారిటీ, న్యాయమైన అంశాల పై జాగ్రతగా ఉండాలి. సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్‌రెడ్డి కులగణన తీర్మానం పై అనుమానం ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాలి. తీర్మానం పై ఏదైనా లీగల్ చిక్కుల పై అంశాలు ప్రతిపక్షాలకు తెలుస్తే తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలి. కులగణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుంది. కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారు. కడియంను తప్పుదోవ పట్టించే వాళ్ళను బయటకు పంపాల్సిందే లేదంటే గాలి సోకుతుంది. ఆనాడు రిజర్వేషన్లు అయితేనే ఆయా సామాజిక నేతలు చట్ట సభల్లోకి వస్తున్నారు మేనిఫెస్టోలపై ఓరోజు చర్చ పెడదాం 2014, 2018, 2023లో పార్టీల మ్యానిఫెస్టో లపై ప్రత్యేకంగా చర్చిద్దాం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే మంత్రివర్గ ఆమోదంతో సభలో తీర్మానం పెడుతున్నాం. ఈ పదేళ్లు మీరేం చేశారు.. ఈ 60 రోజుల్లో మీరు ఏం చేశారన్నది చర్చిద్దాం సభలో తీర్మానం పెట్టింది మేమే ఈ తీర్మానం.. బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే మా ఉద్దేశం బాధితులుగా ఉన్నవాళ్లను పాలకులుగా చేయాలన్నదే మా ఆలోచన కులగణనపై అనుమానాలొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి కులగణనపై.. ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలు చట్ట సభల్లో అన్నికులాలకు న్యాయం చేసేందుకే కులగణన గతంలో కాంగ్రెస్ హయాంలో జస్టిస్ కమిటీ ఏర్పాటు చేశాం సమగ్ర కుటుంబ సర్వే చేశామని బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకుంటుంది బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? ఎన్నికల కోసమే బీఆర్ఎస్ అప్పుడు ఆ సర్వే వివరాలను వాడుకుంది మాకు రాజకీయ దురుద్దేశాలు లేవు కులగణనపై అనుమానాలొద్దు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నకి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం మేము మీలాగా సకల జనుల సర్వే అని చెప్పి బొంబాయి నుండి బస్సుల రమ్మని.. ఎక్కడైకైనా రమ్మని చెప్పలేదు మీకున్న సందేహాలు నివృత్తి చేసే బాధ్యత మాది... మాజీ మంత్రి 10 ఏళ్లుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యే గా ఉండి అప్పుడు బలహీన వర్గాల గొంతు వినిపించలేదు కాబట్టి అపుడు చెప్పేలేదని ఇప్పుడు చెబుతున్నారు కావొచ్చు ఎవరు ఏమి చెప్పిన వింటాం..జవాబు చెబుతాం.. మా ప్రభుత్వం చిత్తశుద్ది తో ఉంది. మీరేమైనా సలహాలు ఇవ్వండి.. దానిపై ప్రత్యేక చర్చ చేయండి. పాత మేనిఫెస్టో లో ఉంటే చర్చ చేయండి.. మీరు 10 ఏళ్లుగా నియంత్రుత్వ ప్రభుత్వంలో మీరు ఎం చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్పుకుంటా అంటే నడవదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. కులగణనను మేం ఆహ్వానిస్తున్నాం కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదు కులగణనపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి జన, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది తీర్మానంకు చట్ట బద్ధత అయిన కల్పించండి లేదంటే న్యాయ పరంగా అయినా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదు. కులగణన చేప్పట్టిన ఆయా రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు పడ్డాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మాణం ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం దేశంలో ఉన్న సంపద, రాజ్యాధికారం జనాభా ధమాషా ప్రకారం దక్కాలని మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధి గ ఆనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరుగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఎన్నికల్లో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి రాగానే కుల గణన చేస్తామని చెప్పాము. కులగణన తెలంగాణ నుంచి మొదలు పెడతామని చెప్పి క్యాబినెట్లో చాలా కులంకుశంగా చర్చించి నేడు అసెంబ్లీలో కుల గణనపై తీర్మాణం పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన తో పాటు సోషల్, ఎకానమిక్, ఎడ్యుకేషన్, పొల్టికల్, ఎంప్లాయిమెంట్ అంశాలపై సర్వే చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని, అన్ని కులాలు, ఆర్ధిక స్థితిగతలపై సర్వే చేస్తాము. ఈ సర్వే ద్వారా సంపద ఎక్కడ కేంద్రీకృతమైంది. ఆ సంపదను అన్ని వర్గాలకు జనాభా దమాషా ప్రకారం ఏలా పంచాలన్నదానిపై అన్ని రకాల ప్రణాలికలు తయారు చేస్తాము. ప్రతిపక్ష సభ్యులు కుల గణనపై ఏలాంటి ఆందోలన గందరగోళం కావొద్దు. సామాజిక ఆర్ధిక రాజాకీయ మార్పునకు పునాధిగా తెలంగాణ మారబోతుంది. 10 సంవత్సరాలు అధికారంలోకి ఉన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వం కుల గణన చేయలేదు. ఇప్పుడు కుల గణన చేయాలని ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి కార్యాక్రమానికి మద్దతు ఇవ్వకుండ రన్నింగ్ కామెంట్రీ చేయడం సరికాదు ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేస్తాం.. ఆర్థిక స్థితి గతులు కూడా సర్వే చేస్తాం సర్వేలో అన్ని వివరాలు పొందుపరుస్తాం.. సర్వరోగ నివారిణిలాగా సర్వే ఉంటుంది అసెంబ్లీలో కుల జనగణన తీర్మానంపై చర్చ బీసీ కుల గణనతో బీసీలే నష్టపోతారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల 2017లోనే సమగ్ర సర్వే చేశాం.. మళ్లీ ఎందుకు?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల తెలంగాణ శాసన సభలో కులగణన తీర్మానం బీసీ కుల గణన తీర్మానం శాసన సభలో ప్రవేశ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి @అసెంబ్లీ గత ప్రభుత్వంలోనే 60 CMRF చెక్ లు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ ఉన్న CMRF నిదుల పై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలకు ముందు 1లక్ష కోట్ల శాంక్షన్స్ ఇచ్చి పోయింది. గత ప్రభుత్వంలో శాంక్షన్స్ పై కీలకమైన అంశాల గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మంత్రి జోన్ ల వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది జోన్ ల మార్పు పై చర్చిస్తాం సునితా లక్ష్మారెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిరిసిల్ల జోన్ నుంచి మెదక్ ను చార్మినార్ జోన్ కు మార్చాలి. రాజ్ ఠాకూర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బొగ్గు గని కార్మికుల కు మెరుగైన వసతులు కల్పించాలి సింగరేణి ఆసుపత్రికి తగినన్ని నిధులు వెంటనే విడుదల చేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 2017 లో సైనిక్ స్కూల్ కు అనుమతి వచ్చింది.. దాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు తరలించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.. వర్దన్న పేట ,స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల రెండు నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అవుతుంది.. దాన్ని మరో చోటు కు తరలించాలి.. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణం తొలగించకూడదని ప్రభుత్వం కు విజ్ఞప్తి జీరో అవర్ లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరు పెట్టారు కానీ.. కల్వకుర్తి వరకు నీరు రాలేదు రైతులకు పరిహారం 40 కోట్లు పెండింగ్ ఉంది కల్వకుర్తి రైతులకు నీరు అందించాలి.. భూమి కోల్పోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలి జీరో అవర్ లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలి లెదర్ పార్క్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి నారాయణ పూర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పనులు వెంటనే పూర్తి చేయాలి జీరో అవర్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఊసే లేకుండా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ 80 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు షాద్ నగర్ కు సాగు, తాగు నీరు రాలేదు మిషన్ భగీరథ లో లీకేజీలు జరుగుతున్నాయి.. ఇష్ట రాజ్యంగా తవ్వుతున్నారు డబుల్ బెడ్ రూం ఇల్లు పంపిణీ చేయకపోవడంతో కట్టిన ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయి ►తెలంగాణ శాసనసభ లో జీరో అవర్ ప్రారంభం ►ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ నేడు అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేత పత్రం విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం నేడు ఇరిగేషన్ పై స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నట్లు అసెంబ్లీ బిజినెస్ రూల్స్ లో ప్రస్తావన ఇరిగేషన్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం నేడు ఇరిగేషన్ చర్చలో ప్రధాన అస్త్రంగా మారనున్న కాగ్ రిపోర్ట్ ప్రధాన అస్త్రంగా.. గురువారం నాటి సభలో కాగ్ రిపోర్టును పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కాగ్ రిపోర్టులో సైతం కాళేశ్వరం పై అనేక ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు ప్రస్తావించిన కాగ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆఖరి రోజు నేడు మాజీ మంత్రి హరీష్ చిట్ చాట్ అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ ఈ రోజు ప్రజాభవన్ కు వెళ్తానన్నారు రోజూ ప్రజాభవన్ కు వెళ్తానని చెప్పిన సీఎం తొలి రోజు మాత్రమే వెళ్లారు. ఇదే అంశాన్ని మొన్న అసెంబ్లీలో మేము ఆధారాలతో సహా నిలదీశాం. దీంతో ఈ రోజు హడావుడిగా కేవలం అరగంట ముందు సమాచారం ఇచ్చి అసెంబ్లీకి వెళ్లారు. సీఎం ప్రజాభవన్ కు వస్తారని నిన్ననే సమాచారం ఇస్తే ఈ రోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లేవారు -
ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ప్రజలు సానుభూతి చూపరు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు ప్రజలను గోస పెట్టిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ప్రజలు సానుభూతి చూపరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న అసెంబ్లీకి రావడానికి కేసీఆర్‌కు చేత కాలేదు కానీ, కట్టె పట్టుకొని సానుభూతి కోసం నల్లగొండకు వెళ్లారని విమర్శించారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు తమను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం చేసిన దోపిడీని చూపించేందుకే మేడిగడ్డకు వెళ్లామని, ప్రాజెక్టు పేక మేడలా కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా పారిపోయారన్నారు. ఔరంగజేబు అవతారమెత్తాల్సిందే హరీశ్‌రావు పదవి కోసం ఔరంగ జేబు అవతారమెత్తాల్సిందేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నువ్వు రాజీనామా చెయ్.. నేను చేసి చూపిస్తా’ అని హరీశ్‌రావు చెబుతున్నారని, దీనిని బట్టి సీఎం కావడానికి హరీశ్‌రావు.. మరో ఔరంగజేబు కావాల్సిందేనని ఎద్దేవా చేశారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుదని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నపుడు గాలికి తిరిగారా? అని ప్రశ్నించారు. దోచుకున్నది దాచుకోవడానికి బీఆర్ఎస్ పదేళ్లు పనిచేసిందన్నారు. ఒక రైతు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ కళ్లు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో గ్రూప్–1 పరీక్ష నిర్వహిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని. త్వరలో గ్రూప్–1 పరీక్ష నిర్వహిస్తామన్నారు. అధికారం చేపట్టిన 70 రోజుల్లోనే దాదాపు 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే కాంప్లెక్స్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విద్యార్థుల్లో సోదర భావం మరింత పెంపొందించేందుకు గురుకుల పాఠశాలలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొండగల్‌లో సుమారు 20 ఎకరాల్లో వంద కోట్ల వ్యయంతో గురుకులాల సముదాయం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలను చేపడతామన్నారు. వైఎస్సార్‌ది జనరంజక పాలన దివంగత వైఎస్సార్ హయాంలో జనరంజక పాలన సాగిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. 2004లో ఇదే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణ, విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. ఆదే స్ఫూర్తి, ఆలోచనతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నించామన్నారు. కాంగ్రెస్ విజయంలో నిరుద్యోగుల కృషి మరవలేదని చెప్పారు.. గ్రీన్ చానల్ ద్వారా మెస్ చార్జీలు: మంత్రి పొన్నం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాలకు మెస్ చార్జీలను గ్రీన్ చానల్ ద్వారా అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 2004–14 మధ్య మెస్ చార్జీలన్నీ గ్రీన్ చానల్ ద్వారా పేమెంట్ అయ్యేవని, కానీ 2014 తరువాత రెండేళ్ల వరకు మెస్ చార్జీలు రాక నాణ్యత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని తయారుచేశాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు మాట్లాడారు. -
ఇది ప్రతిపక్షం కాదు.. ఫ్రస్టేషన్ పక్షం
సాక్షి, హైదరాబాద్: ‘వీళ్ళది ప్రతిపక్షం కాదు... ఫ్రస్టేషన్ పక్షం’అంటూ మంత్రి కోమటి రెడ్డి, ‘మా వల్ల ఏ ప్రమాదం లేదు... మీ వాళ్ళతోనే జాగ్రత్త’అంటూ సీఎంనుద్దేశించి బీఆర్ఎస్ సభ్యుడు కడి యం శ్రీహరి పరస్పర విమర్శనాస్త్రాలతో శాసనసభ గురువారం వేడెక్కింది. బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పిన అనంతరం అనుబంధ సందేహాలను కడియం శ్రీహరి లేవనెత్తేందుకు స్పీకర్ అనుమతించారు. ఈ దశలో బీఆర్ అంబేడ్కర్ దళిత బంధు పేరుతో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కరికీ రూ.12 లక్షలు ఇస్తామన్నారని, బడ్జెట్లో ఇందుకు సంబంధించిన కేటాయింపులు లేవని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకుని ‘ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చి, మోసం చేయడం బీఆర్ఎస్కే అలవా టు. వీళ్ళు ప్రతిపక్షం కాదు... ఫ్రస్టేషన్ పక్షం. అధికారం పోయిందనే అసహనంతో ఉన్నారు. హరీశ్ రావు నేనే సీఎం అయితే అంటున్నాడు. వీళ్ళకు ఏదో సమస్య వచ్చింది. వీళ్ళను దేవుడు కూడా కాపాడలేడు.’’అని వ్యాఖ్యానించారు. హోంగార్డు చనిపోతే పట్టించుకోలే: కోమటిరెడ్డి ’’ఇటీవల జరిగిన నల్లగొండ సభకు వీళ్ల ఎమ్మెల్యే కారణంగా ఓ హోంగార్డు చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కనీసం వీళ్ళు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని, తన మాట అమలు కాకపోతే తల తీసుకుంటానన్నాడు దీన్ని అమలు చేశారా? మా పార్టీ నుంచి దళితుడు కాంగ్రెస్ ప్రతిపక్ష నేతయితే ఓర్వలేదు. మా ఎమ్మెల్యేలను కొనేశారు.’అని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇందుకు కడియం అంతే ఘాటుగా బదులిచ్చారు. ‘అసహనంతో ఉన్నది మీరే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, తాను పూర్వాశ్రమంలో ఒకే స్కూల్లో చదువుకున్నాం. నేను సీనియర్ స్టూడెంట్ను. ఆయన జూనియర్. రేవంత్ సీఎంగా ఉండాలని నా మనసులో ఉంది. కానీ రేవంత్ మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మా గురించి మీరు వర్రీ కాకండీ ... మీ వాళ్ళను జర జాగ్రత్తగా చూసుకోండి’అని మాట్లాడటంతో సభలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. 2 లక్షల ఉద్యోగాలెప్పుడిస్తారు?: కడియం బహిరంగ మార్కెట్లో రుణాలు రూ.59,625 కోట్లు వస్తుందని అంచనా వేశారని, పన్నుల రూపంలో అదనంగా రూ. 20 వేల కోట్లు వస్తుందని చెప్పారని, అయినా ఆర్థిక లోటు రూ.53 వేల కోట్లు రావడానికి కారణమేంటో చెప్పాలని కడియం శ్రీహరి నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఇంత వరకూ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో యువ వికాసం వదిలేసి, ఐదు హామీలకు బడ్జెట్లో రూ. 53,193 కోట్లు కేటాయించారని, ఏ హామీకి ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున, 4.16 లక్షల ఇళ్ళు అవసరమని, ఇంటికి రూ.5 లక్షలు లెక్కన. ఎస్సీ, ఎస్టీ అయితే మరో రూ. లక్ష ఇస్తామన్నారని, ఇవన్నీ కలిపితే, రూ.23 వేల కోట్లపైన అవుతుందన్నారు. కానీ బడ్జెట్లో కేటాయింపు మాత్రం రూ. 7,750 కోట్లు మాత్రమేనని, ఈ పధకాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎస్సీల రిజర్వేషన్ 18 శాతం పెంచుతామని ఇచ్చిన హామీపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగాల భర్తీ కొనసాగుతుంది: పొన్నం ఈ దశలో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆరోపించారు. పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను నియమించామని, ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు
వేములవాడ రూరల్: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే మేడిగడ్డకు ఈ దుస్థితి పట్టిందని, ఈ అంశంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్, బీఆర్ఎస్లు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర గురువారం సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, వేములవాడ అర్బన్ మండలాల్లో కొనసాగింది. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్ సహా ఇతర బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్లానింగ్, డిజైన్, నిర్వ హణ విషయంలో రాష్ట్రాన్ని 20 అంశాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంస్థలు వివరణ కోరితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 11 అంశాలకే వివరణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాకు రూ.1,408 కోట్ల కేంద్రం నిధులు తెచ్చినట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయన్నారు. ఈ బ్యారేజీల్లో సైతం మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి రాణి రుద్రమ, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ తదితరులు బండి సంజయ్ వెంట ఉన్నారు. -
పని చేయలేని వాళ్లు తప్పుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహిస్తున్న విజయసంకల్పరథ యాత్రల విజయవంతం ద్వారా పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకునే అవకాశముందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ లోక్‌సభ సీట్లలో పార్టీ గెలవాలంటే నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్రపార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో విజయసంకల్పయాత్రలో పాల్గొనబోయే సభ్యులను ఉద్దేశించి కిషన్‌రెడ్డి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో... ఈ యాత్ర ప్రాధాన్యతను గుర్తించి అందరూ కష్టపడి పనిచేయాలని లేని పక్షంలో పార్టీకి నష్టం జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ యాత్రల్లో చురుగ్గా పనిచేయలేమని భావించే వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు. పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా, జాతీయ నాయకత్వం ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ పనిచేయాలనుకునే వారే బాధ్యతలు, పదవుల్లో కొనసాగాలని స్పష్టం చేశారు. చాయ్ టిఫిన్ పేరిట నేతలతో కిషన్ భేటీ గురువారం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్‌రావు, ఆదిలాబాద్ జిల్లా పార్టీ నేతలతో కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. చాయ్–టిఫిన్ పేరిట ఏర్పాటు చేసిన ఈ భేటీలో ఈ నెల 20న బాసర సరస్వతీ మాత ఆలయంలో పూజల అనంతరం భైంసాలో మొదలుపెట్టనున్న విజయసంకల్పయాత్ర ఏర్పాట్ల అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. -
కేసీఆర్‌ను వ్యతిరేకించి బయటకు వస్తే మద్దతు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనలో మాజీమంత్రి హరీశ్‌రావు ఉన్నట్టున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పారు. తనను సీఎం చేస్తే మేడిగడ్డను పూర్తిచేసి చూపుతానన్న హరీశ్‌రావు వ్యాఖ్యల నేపథ్యంలో వెంకటరెడ్డి పైవిధంగా స్పందించారు. ఆయన గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను వ్యతిరేకించి హరీశ్ బయటికొస్తే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇరవైమంది ఎమ్మెల్యేలతో ఆయన బీఆర్ఎస్ పార్టీ నేత కావాలని సూచించారు. బీఆర్ఎస్లోనే ఉంటే హరీశ్‌రావు ఫ్లోర్‌లీడర్ కూడా కాలేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీశ్, కేటీఆర్ పేర్ల మీద మూడు గా విడిపోతుందని జోస్యం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కర్ర పట్టుకుని తిరుగుతున్నారని, అలాంటపుడు ఆయన పులి ఎట్లా అవుతారని ప్రశ్నించారు. 60 కేజీల బరువున్న కేసీఆర్ పులి అయితే.. 86కిలోల బరువున్న తానేం కావాలో చెప్పాలన్నారు. రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్ పారీ్టనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఆ ముగ్గురి ఎన్నిక లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు గాను మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు, బీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్‌నేత రేణుకా చౌదరి, యువనేత అనిల్‌కుమార్ యాదవ్ చెరి మూడేసి సెట్ల చొప్పున, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రెండుసెట్ల నామినేషన్‌పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థులు మూడే సి సెట్ల నామినేషన్లలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు (ఒక్కో దాంట్లో పదేసి మంది చొప్పున మొత్తం 60 మంది సభ్యులు)సంతకాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి రేణుకా చౌదరి తమ నామినేషన్ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో సమర్పించారు. అనిల్‌కుమార్ యాదవ్ తమ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో అందజేశారు. వద్దిరాజు రవిచంద్ర తమ పత్రాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు గంగుల కమలాకర్, నాగేందర్, జగదీశ్‌రెడ్డి సమక్షంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రేణుక, అనిల్‌కు బీఫామ్స్ అందజేసిన సీఎం అంతకుముందు సీఎం చాంబర్లో అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌కు రేవంత్‌రెడ్డి బీఫామ్స్ అందజేసినపుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిశ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్, తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వద్దిరాజు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎన్నిక ఏకగ్రీవమే! వచ్చే ఏప్రిల్ 2న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు సీట్లకు గాను నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలు కావడంతో... కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈ నెల 27న ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండానే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న పత్రాల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణకు అఖరి రోజు. ఈ గడువు ముగియగానే ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. -
మోదీ ‘అన్యాయ్‌కాల్’కు కౌంట్‌డౌన్ మొదలైంది
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ హయాంలోని పదేళ్ల ‘అన్యాయ్‌కాల్’కు కౌంట్‌డౌన్ మొదలైందని, త్వరలోనే అది ముగుస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. మోదీ ఇచ్చిన హామీలు గత పదేళ్ల కాలంలో ఒక్కటి కూడా అమలు కాలేదని, కానీ వాగ్దానాలతో చేసిన ఆయన ప్రసంగాలు ఇంకా ప్రజల జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తున్నాయని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన సందర్భంగా పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధత కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీని రెండేళ్లయినా పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీలో రైతుల తాజా ఆందోళనను నిలువరించేందుకు డ్రో న్లు ఉపయోగించి గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో గ్యాస్ సిలెండర్ ధరలు రెండింతలు పెరిగాయని, దేశ అప్పులు మూడు రెట్లు పెరిగాయని, దేశంలోని ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరిన పఠాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన నీలం మధు గురువారం దీపాదాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయనను దీపాదాస్మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్ అధ్యక్షుడు కావాలి: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని.. బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్‌రావు అధ్యక్షుడు కావాలంటూ వ్యాఖ్యానించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. రాజగోపాల్‌రెడ్డి. ఎంఐఎం మాతోనే ఉందని.. తమకు 72 సీట్లు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో చాలా మంది నేతలు అవమానానికి గురైన వారు ఉన్నారు. అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకుంటాం. డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే మాకు ఎలా వాడుకోవాలో తెలుసు. క్యాబినెట్ విస్తరణ పై నాకు సమాచారం లేదు. ఎన్ని సార్లు అధికారంలో ఉంటామనేది మనం చెప్పలేము. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఉంది. 2029 గురించి ఇప్పుడు ఏం చెప్పలేమని కోమటిరెడ్డి అన్నారు. ఈటలను ఓడించేందుకు దళితబంధు తెచ్చారు..దళితులపై ప్రేమతో కాదు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదంటూ రాజగోపాల్‌రెడ్డి సలహా ఇచ్చారు. కేటీఆర్ పొలిటీషియన్ కాదు.. హైటెక్ పొలిటీషియన్. భవిష్యత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు మునిగినట్లే. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ గెలవదు. కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుంది. ఎంఐఎం మాతోనే ఉంది. ప్రభుత్వం ఎవరిది ఉంటే ఎంఐఎం వారితో ఉంటుంది. భువనగిరి నుంచి బీసీకి టిక్కెట్ ఇస్తే గెలిపించే బాధ్యత నాది’’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. -
మరో ఔరంగజేబులా హరీశ్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్‌కు కాళ్ల నొప్పులొస్తాయని ఎద్దేవా చేశారు. నల్గొండకు వెళ్లడానికి మాత్రం ఎలాంటి నొప్పులు ఉండవని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేసే కార్యక్రమంతో పాల్గొని మాట్లాడారు. హరీశ్‌కు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాల్సిందేనని అన్నారు. పదేళ్లు చేసిందేమీ లేదు.. మేము రాగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. ‘ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్ నిర్లక్ష్యం వహించింది. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. 30లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించాం.త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నాం. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీశ్ అంటుండు. హరీశ్‌రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. పదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్ ఏం చేశారు?. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు. దశ బాగుంటే దిశతో పని లేదు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలి. ...3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?. మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా?. మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరు. బీఆరెస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే ఒకే గొడుకు కిందకు తీసుకోస్తాం. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కొడంగల్‌లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఈ మోడల్‌ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. -
‘సీఎం కావడానికి హరీష్ రావు ప్లాన్‌లో ఉన్నాడు’: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు కావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని అన్నారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మాట్లాడుతూ.. హరీష్‌రావు ముఖ్యమంత్రి కావాలనే ప్లాన్‌లో ఉన్నట్టున్నాడు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వస్తే మేము అందుకు సపోర్టు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్‌రావు, కవిత పేర్ల మీదుగా విడిపోతుంది. బీఆర్ఎస్లో నాలుగు పార్టీలు అవుతాయి. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలి. కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నాడు.. ఆయన పులి ఎట్లా అవుతాడు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న నేనేం కావాలి. ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రేణుకా చౌదరి, అనిల్ కుమార్
రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ పత్రాలు సమర్పించిన నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌కు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు. సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సెక్రటరీ వద్ద రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నానామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. -
కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కట్టె కాలేవరకు కేసీఆర్ తెలంగాణను దోచుకుంటూనే ఉంటారు. కేటీఆర్ బతుకేంటో నాకు తెలుసు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, బండి సంజయ్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించిన వాళ్లు, అయోధ్య అక్షింతలపై రాజకీయం చేసే వాళ్లను బహిష్కరించండి అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్, కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. ‘కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు.. టిక్కెట్ కోసం ఎన్టీఆర్ వద్దకు పోయి కేటీఆర్ అని పేరు మార్చాడు. కేసీఆర్‌వి ఆలోచనలు అన్నీ కొంప ముంచేవే. కేటీఆర్ బతుకేందో నాకు తెలుసు.. ముడతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకుని తిరిగేటోడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలను అమలు చేయకుండా దాటవేసే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. అవగాహనతోనే ఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నారు. కృష్ణా, కాళేశ్వరంపై విచారణ జరపాలి. దోషులను జైలుకు పంపాలి. సిరిసిల్ల జిల్లాకు కేవలం ఏడు పథకాల కోసమే రూ.1408 కోట్లకుపైగా నిధులిచ్చింది. ఈ జిల్లాలో మొక్కల పెంపకం కోసమే రూ.266 కోట్లకుపైగా నిధులిచ్చింది. మరి ఆ నిధులన్నీ ఏమైపోయాయి.. ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు. పైసలిచ్చేది మోదీ.. మీ కోసం కొట్లాడేది బీజేపీ.. కానీ, కాంగ్రెస్‌కు ఓటేయడం ఎంత వరకు న్యాయం? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గుడిని మింగితే.. కాంగ్రెస్ గుడిలోని లింగాన్ని సైతం మింగేసే బాపతు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మీరు ఎంపీగా గెలిపించారు. మీకోసం నిరంతరం పోరాడాను. నాపై 100కుపైగా కేసులు పెట్టినా భయపడలేదు. నేను మా తాత, తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు. కార్యకర్తగా నుంచి ప్రజల నుంచి పోరాడి ఎంపీ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తమే. బీజేపీకి ఓటు వేసి మోదీని మళ్లీ ప్రధానిని చేద్దాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
మాకు కొట్లాట కొత్తేం కాదు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పరస్పర ఆరోపణల మొదలు.. అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలు వాడే భాష దాకా.. విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం నాటి పరిణామాలు మరింత నాటకీయంగా సాగాయి. పదేళ్లపాటు అధికారపక్షంలో ఉన్న బీఆర్ఎస్.. తొలిసారి ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. ఇది ఇక్కడితోనే అయిపోలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు యత్నించగా.. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది. జై తెలంగాణ అంటూ పోస్ట్ చేశారాయన. అసెంబ్లీలో నిన్నటి నిరసన.. తెలంగాణఉద్యమ కాలం నాటి రోజుల్ని గుర్తు చేసిందంటూ సందేశం ఉంచారు. Yesterday’s protest in Assembly brought back memories of Telangana Agitation Days మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి… రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది. జై… pic.twitter.com/Zn1IidXhQS — KTR (@KTRBRS) February 15, 2024 -
ఇది కంచెల రాజ్యం
సాక్షి, హైదరాబాద్: సభలో మాట్లాడన్విరు.. అసెంబ్లీ బయట కూడా మాట్లాడన్వివరా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీలో వాకౌట్ చేసిన అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడేందుకు వెళ్లే క్రమంలో అక్కడ ఉన్న అసెంబ్లీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రికత్త నెలకొంది. ఆ ప్రాంతం భారీ ఎత్తున పోలీసులు, మార్షల్‌తో నిండిపోయింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీడియా పాయింట్లో మాట్లాడొద్దని ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజ మెత్తారు. ఇదేనా ప్రజా పాలన అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు అణచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం.. పోలీసు రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినదించారు. మీడియా పాయింట్‌కు వెళ్లే దారి మధ్యలో నేలపై కూర్చొని నినాదాలు చేశారు. చివరిగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీకు చెప్పినా ఒక్కటే.. గోడకు చెప్పినా అక్కటే అంటూ’’ అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు. రేవంత్ చెప్పేదొకటి.. చేసేదొకటి: కడియం, పల్లా, వేముల అంతకుముందు అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కంచెలు తొలగిస్తామని చెప్పి ఇప్పుడు కంచెలెందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి బయట ఒకటి చెబుతున్నారని, అసెంబ్లీలో ఒకటి చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు అనీ, అలాంటి ప్రాంతంలో నియంత్రణ ఎలా పెడతారని నిలదీశారు. రాజగోపాల్‌రెడ్డి మాటలను రికార్డుల నుంచి తొలగించాలి కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాష గా చెప్పుకుంటున్నాడని, తెలంగాణ భాషను సీఎం అవమానపరుస్తున్నారని విమర్శించారు. రెండు నెలల్లో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని, అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదని, ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సచ్చిన పామును మళ్లీ చంపుతారా?
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం దోపిడీ బయటపడు తుందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కేసీఆర్‌ను చంపుతారా అంటూ మాట్లాడుతున్నారని, ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఇప్పటికే సచ్చిన పామును మళ్లీ ఎవరైనా చంపుతారా? మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆ పామును చేతితో కాదు కట్టెతో కొట్టారు. ఆల్రెడీ చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేం ఉంది?’ అని వ్యాఖ్యానించారు. సానుభూతి కోసం కేసీఆర్ వీల్‌చైర్, వీధినాటకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై సభలో చ ర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చేలా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూడాలన్నారు. బుధవారం అసెంబ్లీలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య బడ్జెట్‌పై వాదోపవాదాలు జరుగుతుండగా సీఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. కేసీఆర్‌ను సభకు రమ్మనండి ‘సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్ర వేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ పారిపోయి ఫామ్‌హౌస్‌లో పడుకుని, అక్కడెక్కడి కో పోయి ప్రగల్భాలు ఎందుకు? సభకు రమ్మనండి..వాస్తవాలపై చర్చిద్దాం..అన్ని అంశాలపై మాట్లా డదాం. అలా కాదు కాళేశ్వరంపైనే చర్చిద్దామంటే అందుకు కూడా స్పీకర్ విడిగా సమయం కేటాయి స్తే చర్చకు సిద్ధం. మేడిగడ్డ మేడిపండు మాదిరిగా కుంగిపోతే, అక్కడ నీళ్లు నింపే అవకాశముందా? కేసీఆర్, హరీశ్‌రావు సాగునీటి శాఖ మంత్రులుగా పనిచేశారు కదా.. వారికే బాధ్యతలు అప్పగిస్తాం..వారే ఎలా మేడిగడ్డలో నీళ్లు నింపి అక్కడి నుంచి అన్నారం, సుందిళ్లలో పోస్తారో బాధ్యత తీసుకోవాలి..’ అని రేవంత్ అన్నారు. నేటి సాయంత్రం దాకా చర్చకు సిద్ధం ‘బీఆర్ఎస్ఎల్పీ నేత అసెంబ్లీకి వస్తే..గురువారం సాయంత్రం దాకా కాళేశ్వరం ప్రాజెక్టుపై, గోదావరి నదీజలాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులపై, తెలంగాణ ప్రజలపై గౌరవంతో ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నిస్తే.. అందరం కలిసి వెళ్లి ప్రాజెక్టులను పరిశీలించి వద్దామని అనుకున్నాం. అలా వెళితే అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంది. కానీ ఈ పర్యటనకు బీఆర్ఎస్ రాకపోగా, మేడిగడ్డ విషయంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, వైఫల్యాలకు తామే బాధ్యత వహించాలి అన్నట్టుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతు న్నారు. పదే పదే భాష గురించి మాట్లాడుతున్నారు. మంగళవారం నల్లగొండలో కేసీఆర్ మాట్లాడిన భాషపై సభలో చర్చిద్దామా? సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని ఏమి పీకడానికి మేడిగడ్డ వెళ్లారంటూ మాట్లాడతారా? కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన, ఎమ్మె ల్యేగా, ఎంపీగా, పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి నాలు గు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ఓ సీఎంపై అలాంటి భాషను ఉపయోగిస్తారా? ఉద్యమకారు డిని అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఏమి పీకడానికి వెళ్లారని నిలదీస్తారా? ఇదేనా తెలంగాణ సంప్రదాయం? గౌరవం? అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే కేసీఆర్ ప్యాంట్‌ను తెలంగాణ ప్రజలు ఊడ బెరికారు. మళ్లీ వస్తానంటే ఉన్న అంగీ కూడా ఊడబెరుకుతారు. బొక్క బోర్లాపడి బొక్కలు విరిగినా ఇంకా బుద్ధి మారలేదు..’ అంటూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందరినీ ఒకేవిధంగా చూడండి: కేటీఆర్ రెండురోజుల క్రితం రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతు న్నపుడు కడియం శ్రీహరి ఏవో వ్యాఖ్యలు చేశారని, వాటిపై రాజ్‌గోపాల్‌రెడ్డి బుధవారం స్పందించి ఉంటారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. దీంతో కడియం శ్రీహరిపై రాజ్‌గోపాల్‌రెడ్డి ఏదైనా అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించి ఉంటే వాటిని పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ తెలిపారు. అయితే తనపైనే కడియం అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌పై తమకు అపార గౌరముందని, తాము ఏదైనా తప్పు మాట్లాడితే దానిని సవరించే అధికారం వారికుందని కేటీఆర్ చెప్పారు. అయితే అధికారపక్ష సభ్యులు తమను వ్యక్తిగతంగా దూషించినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా సభాపతి ఏమీ అనడం లేదని అన్నారు. సభ్యులందర్నీ ఒకేవిధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం సత్యదూరమైన మాటలు చెబుతుంటే బాధతో ‘కూర్చో’ అన్నామే తప్ప ఆయన్ను అవమానించాలని కాదన్నారు. ‘కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలకు గాను ఒక్క బ్యారేజీలో ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి. రైతులపై మాత్రం కోపం పెంచుకోకండి. కేసీఆర్‌పై కోపం ఉంటే ఆ ప్రాంత రైతాంగంపై కక్ష కట్టొద్దు. మేడిగడ్డ నింపండి. కాళేశ్వరంలో పంపింగ్ మొదలుపెట్టండి..’ అని కేటీఆర్ సూచించారు. -
నన్ను గెలికితే అంతు చూస్తా మీ బాగోతాలన్నీ బయటపెడతా: బండి
గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): ‘గచ్చిబౌలి లో రూ.500 కోట్ల విలువ చేసే ఆరు ఎకరాల భూదా న్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ బాగోతం చిట్టా నా దగ్గర ఉంది. బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌లో 20 ఎకరాల సింగిల్బిట్ను ఎవరి పేరిట కొన్నారో తెలుసు.. బంజారాహిల్స్ లోటస్‌పాండ్ సమీపంలోని భవంతిలో అధికా రులను పిలిపించుకొని సాగిస్తున్న దందాలన్నీ తెలుసు.. నన్ను గెలకొద్దు.. గెలికితే అంతుచూస్తా.. నాపై అవాకులు చెవాకులు పేలితే మొత్తం మీ బాగోతాలన్నీ బయ టపెడతా..’ అంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ కీలక నేతనుద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. బండి చేపట్టిన ప్రజాహి తయాత్ర ఐదో రోజు బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సబ్‌కాంట్రాక్ట్ సంస్థ నిర్వాకంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోయే ప్రమాదముందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని, ఆ సంస్థ ఎవరిదో.. అనే వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. కటె ్టకాలేవరకు కేసీఆర్ దోచుకుంటడు.. కట్టెకాలే వరకు ప్రజల కోసం పనిచేస్తానన్న కేసీ ఆర్.. కట్టె కాలే వరకు ప్రజలను దోచుకుంటాడని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన కేసీఆర్‌ను అరెస్టు చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. -
రాజ్యసభకు మళ్లీ వద్దిరాజు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరును పార్టీ అధి నేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు జరిగే ఎన్నికకు సంబంధించి గురువారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్ నేతలతో చర్చించి వద్దిరాజు అభ్యర్థిత్వంపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వద్దిరాజు గురువారం నామినేషన్ దాఖలు చేస్తారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు. కాంగ్రెస్‌కు రెండు.. బీఆర్ఎస్కు ఒకటి రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్కు చెందిన వారే కావడం గమనార్హం. వీరిలో జె.సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ ఈ ఏడాది ఏప్రిల్ 2న తమ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. వద్దిరాజు రవిచంద్ర తన రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం చొప్పున లభించనుంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్ పేర్లు ఇప్పటికే ఖరారు కాగా, బీఆర్ఎస్ తరపున వద్దిరాజు పేరు ఖరారు కావడంతో ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. వరుసగా రెండోసారి.. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన వద్దిరాజు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2022 మేలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్ రాజీనామా చేయడంతో అదే నెల 23న వద్దిరాజును బీఆర్ఎస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో వద్దిరాజుకు రెండోమారు బీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కింది. -
నీకు చేతకాకపోతే తప్పుకో...నేను చేసి చూపిస్తా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించడం చేతకాకపోతే తప్పుకొని ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలని, రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ చేశారు. ‘నాకు చేత కాదు.. నువ్వు చేసి చూపించమని రేవంత్ అడిగితే నేను సిద్ధం.. నాకు బాధ్యత అప్పగిస్తే చేసి చూపిస్తా’ అని అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడా రు. ‘శాసనసభ పవిత్రత, సంప్రదాయాలను సీఎం రేవంత్ మంట గలుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బురద రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రభుత్వం ఎంత తక్కువ చేసి మాట్లాడినా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని, ప్రజలకు జీవధార. ఈ ప్రాజెక్టు విషయంలో మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో ఏ తరహా విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. విచారణ జరిపి బాధ్యులను శిక్షించండి..’అని హరీశ్‌రావు అన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి ‘ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలను పరిష్కరించి, యుద్ధ ప్రాతిపదిక మరమ్మతు పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలి. రెండు పిల్లర్లు కుంగాయనే నెపంతో మొత్తం ప్రాజెక్టు ప్రతిష్టను డామేజ్ చేసే దుష్టపన్నాగానికి కాంగ్రెస్ పాల్పడుతోంది. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి పొలాలకు నీళ్లు మళ్లించండి కానీ తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలిగింది. ప్రాజెక్టు ఫలాల గురించి చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోంది. గతంలో కడెంవాగు ప్రాజెక్టు, సింగూరు డ్యాం, ఎల్లంపల్లి, సాత్నాల ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పునరుద్ధరించడం జరిగింది. పోలవరం డయాఫ్రం వాల్, రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కారకులను శిక్షించి, ప్రాజెక్టులను పునరుద్ధరించి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తారు..’అని హరీశ్ వ్యాఖ్యానించారు. కాలువలు తవ్వి నీళ్లివ్వకపోతే కష్టాలే ‘రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ డైవర్షన్ టూర్ పెట్టుకుని, ఇంజనీర్లు వాస్తవాలు చెబుతున్నా దబాయిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో హెడ్ వర్క్స్ పూర్తయిన తర్వాతే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంపై నిధులు వెచ్చిస్తాం. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా 27 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తే, మేము అన్ని పనులు పూర్తి చేసి 6.36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం కాలువలు తవ్వి నీరు ఇవ్వకుంటే సాగు, తాగునీటి కష్టాలు వస్తాయి..’అని మాజీ మంత్రి హెచ్చరించారు. రీ ఇంజనీరింగ్ వల్లే అంచనాల పెంపు ‘రీ ఇంజనీరింగ్ వలన ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరుగుతుంది. ప్రాణహిత–చేవెళ్ళ ఆంచనా విలువ రూ.17 వేల కోట్లతో మొదలై రూ.38 వేల కోట్లకు పెరిగింది. ఆ తర్వాత కేంద్ర జల సంఘానికి నివేదించే నాటికి రూ.40 వేల కోట్లకు పెరిగింది. తట్ట మట్టి ఎత్తకుండానే ప్రాజెక్టు అంచనా విలువ రూ.17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగినట్టు?. కాళేశ్వరం ప్రాజెక్టులో జలాశయాల సామర్థ్యం పెంచాం. కొత్త జలాశయాలు ప్రతిపాదించాం. జలాశయాల సామర్థ్యం పెరగడంతోనే అంచనాలు పెరిగాయి..’అని హరీశ్‌రావు వివరించారు. -
ఆరు గ్యారంటీల అమలుకు రూ.2.15 లక్షల కోట్లు కావాలి: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ పథకాలకు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది’అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఇప్పటికే రెండు పథకాలు అమలు చేయడం అభినందనీయమేనన్నారు. మిగతా నాలుగు పథకాలు వందరోజుల్లో అమలు చేయాలని చెప్పారు. ఈ ఆరు పథకాలకు బడ్జెట్లో రూ.53,196 కోట్లు కేటాయించారు..రాష్ట్ర ఆర్థిక రాబడి రూ. 2,74,185.7 కోట్లు, ఖర్చు 2,75,890.69 కోట్లుగా బడ్జెట్లో అంచనా వేశారు. రాష్ట్ర రాబడులు, అప్పులకు చెల్లించే వడ్డీలు, నెలవారీ చెల్లింపులకు మధ్య పొంతన కుదరడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 300 హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీపీఎల్ కుటుంబాలకు మహాలక్ష్మి పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.26,990 కోట్లు కావాలని, గ్యాస్ సిలిండర్‌కు రూ.2,699.70 కోట్లు, ఉచిత బస్సు పథకానికి రూ.3,600 కోట్లు, కౌలు రైతులకు రూ. 23,160.8 కోట్లు, మన్రేగా కింద 32 లక్షల వ్యవసాయ కూలీలు ఉంటారని, వీరికి ఏడాది రూ.3,840 కోట్లు, వరికి రూ. 500 చొప్పున బోనస్ ఇస్తే ఏడాదికి రూ.7500 కోట్లు, పంటరుణాలకు రూ.36 వేల కోట్లు కావాలని చెప్పారు. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ఏడాదికి రూ.4800 కోట్లు, అంబేడ్కర్ ఆర్థికచేయూత పథకానికి నిధులెన్నో చెప్పలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థిక చేయూతకు రూ.25 వేల కోట్లు, యువభరోసా, విద్యాభరోసా కార్డు అమలుకు రూ.38,894.22 కోట్లు, విద్యాజ్యోతి పథకానికి రూ.6,476 కోట్లు.. ఇంకా పింఛన్ల పెంపు ఇతర హామీలకు ఇలా కలిపి మొత్తం రూ.2,15,568.54 కోట్లు కావాలని, ఈ నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలన్నారు. కొన్నేళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ డబ్బులు పెండింగ్‌లో ఉంచారని, దీనివల్ల కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ధరణి స్థానంలో భూమాత తెచ్చేందుకు నియమించిన నిపుణుల కమిటీ ఎప్పటిలోగా నివేదిక ఇస్తుందో చెప్పాలన్నారు. బడ్జెట్లో మైనార్టీలకు కేటాయింపులు నిరాశ పరిచాయని, ముస్లిం మైనార్టీ సంస్థలకు మంజూరైన నిధులు దారి మళ్లడంపై విచారణ జరిపించాలని, రాష్ట్రానికే ఆదాయం తెచ్చి పెడుతున్న హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన నిధులు సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేసవి తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయని, గోదావరి, కృష్ణా జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదముందని, రంజాన్ మాసం సమీపిస్తున్నందున పాతబస్తీలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ఈ సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బాలూనాయక్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సాగు,తాగునీటి ఇబ్బంది కలిగించినందుకు మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూనాయక్ డిమాండ్ చేశారు. అన్ని విభాగాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించదని, దీనిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. ఎన్నికల ముందే కేసీఆర్‌కు దళితులు గుర్తుకొస్తారని, అంబేడ్కర్‌కు కనీసం నివాళులు అర్పించని సీఎంగా కేసీఆరే మిగిలిపోతారన్నారు. -
పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెంటనే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నాడని, కేసీఆర్ ఎట్లా వస్తడో ఆయన సంగతేందో చూస్తానని అన్నారు. ‘చంద్రశేఖర్‌రావు.. నీకు సూటిగా సవాలు విసురుతున్నా..ఈ పదేళ్లలో నా ఒక్క వెంట్రుకనైనా పీకుతావేమో చూడు..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఖేల్ ఖతం..దుకాణ్ బంద్ అయ్యిందని అన్నారు. శాసనసభకు రావడానికి చేతకాని కేసీఆర్ వీల్ చైర్లలో నల్లగొండ సభకు వెళ్లి సెంటిమెంట్ డ్రామాలకు తెర తీస్తున్నారని విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ మాయలో పడవద్దని అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక, ఎక్సైజ్, రవాణా శాఖల్లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన మొత్తం 13,445 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘కేసీఆర్ 3,565 రోజులు అధికారంలో ఉన్నారు. అప్పుడే మా ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పదవులు లేకపోతే నెలల సమయం కూడా ఆగకుండా తన కూతురు కవితతో సహా అందరికీ పదవులు ఇచ్చారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పడిన గంటల వ్యవధిలోనే తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చుకున్నారు. 2019లో కూతురు కవిత ఓడిపోతే కేసీఆర్‌కు ఎంతో దుఖం వచ్చింది. ఆరు నెలలు తిరగకముందే ఎమ్మెల్సీ చేశాడు. ఇలా కుటుంబ సభ్యులు, బంధువులకు రాజకీయ పదవులు లేకపోతే వంద రోజులు కూడా ఆగని కేసీఆర్...నిరుద్యోగుల్ని మాత్రం పట్టించుకోలేదు. దాదాపు పదేళ్లుగా 30 లక్షల మంది యువత ఉద్యోగాలకు కోసం ఎదురు చూసేలా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంటే..కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది. కామారెడ్డిలో కేసీఆర్‌ను అక్కడి ప్రజలు బండకేసి కొట్టి ఓడించారు. తెలంగాణను కుటుంబం కోసం బలి ఇచ్చిన కేసీఆర్‌కు తెలంగాణ యువ పోలీసులు తగిన బుద్ధి చెబుతారు. గత ప్రభుత్వంలోని కంచర గాడిదలను ఇంటికి పంపించి, రేస్ గుర్రాలను ప్రభుత్వంలోకి తెచ్చుకున్నామని ప్రజలు అనుకుంటున్నారు..’ అని రేవంత్ అన్నారు. నేను రేవంత్ అన్నలా అండగా ఉంటా.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కోర్టు సమస్యలు పరిష్కరిస్తూ ఒక్కో విభాగంలో ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తోంది. నిరుద్యోగులతో సంతోషం పంచుకోవాలనే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తున్నాం. ఎల్బీ స్డేడియంలో ముఖ్యమంత్రిగా నేను పదవీ స్వీకారం చేసినప్పుడు ఎంత సంతోషం కల్గిందో..అంతే ఆనందం పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు కల్గుతోంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రేవంత్ అన్నగా అండగా ఉంటా. అధైర్యం వద్దు. యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. రాష్ట్రాన్ని సాధించుకున్న యువతకు ప్రభుత్వంలో, ప్రైవేటులో ఉద్యోగాలు, ఉపాధి కలి్పంచే బాధ్యత సీఎంగా నేను తీసుకుంటా. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం ఉద్యోగ నియామకాలలో తప్పిదాలకు తావు లేకుండా, ఎవరికీ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. టీఎస్పీఎస్సీలో గతంలో జరిగిన అక్రమాలను నిలువరిస్తాం. పదేళ్లుగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 567 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాం. నిరుద్యోగులకు నష్టం జరగకుండా వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచాం. అయితే పంజాబ్‌లో యువత గంజాయి, డ్రగ్స్‌తో నిర్వీర్యమైంది. ఆ పరిస్థితి తెలంగాణలో రాకుండా టీఎస్ న్యాబ్ విభాగాన్ని ఏర్పాటు చేసి పట్టిష్టం చేస్తున్నాం. పోలీస్ శాఖలో కొత్తగా భర్తీ అవుతున్న వారు కూడా తెలంగాణను గంజాయి, మత్తుపదార్థాలు లేని రాష్ట్రంగా మార్చుతామని ప్రతినబూనాలి. రాష్ట్రంలో డ్రగ్స్ వాడాలంటే వణుకు పుట్టే పరిస్థితి రావాలి..’ అని సీఎం అన్నారు. ఆ సంతకం రైతులకు మరణ శాసనం ‘కృష్ణా నీటిని ఏపీ కేటాయిస్తూ కేసీఆర్ పెట్టిన ఆ సంతకం ఇప్పుడు తెలంగాణకు గుదిబండగా..ఇక్కడి రైతులకు మరణశాసనంగా మారింది. ఈ పరిస్థితుల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకే కేసీఆర్ నీళ్ల దారి పట్టిండు. మేడిగడ్డ అనే మేడిపండులోని అవినీతి పురుగులు బయటపడతాయన్న భయంతోనే కృష్ణానదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలపై చర్చ కోసం అసెంబ్లీకి రమ్మంటే.. నల్లగొండకు వెళ్లి కేసీఆర్ బీరాలు పలుకుతున్నాడు. ‘కంచర గాడిదలను ఇంటికి పంపించి రేస్ గుర్రాలను తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని, ఆ కంచర గాడిద మళ్లీ అధికారం రావడం కలలో మాట’ అని శాసనసభలో ఒక అటెండర్ నాతో అన్నాడు..’ అని రేవంత్ చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి తెల్ల ఏనుగులా మారిందని అన్నారు. ప్రజల తీర్పు గౌరవించలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని, అధికారం పోయినా ఆయన భాష మారలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో బానిస భవన్‌గా మారిన ప్రగతి భవన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్‌గా మార్చామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మాటల యుద్ధం: కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య మాటల యుద్ధం నెలకొంది. కృష్ణా జలాలు, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ మాజీ సీఎం-సీఎం రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి-కడియం శ్రీహరి, హరీష్ రావు, కేటీఆర్ మధ్య జరుగుతున్న మాటలు మంటలు రేపుతున్నాయి. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నరంటూ కాంగ్రెస్‌పై నల్గొండ సభలో కేసీఆర్ సైటైర్లు వేశారు. తాజాగా కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తీసుకొచ్చారంటూ పంచ్‌లు వేశారు. కంచెర గాడిదలకు అధికారం ఇక కలగానే మిగులుతుందన్నారు. నన్ను చంపుతారా అని కేసీఆర్ అంటుండు.. చచ్చిన పామును ఎవరైనా చంపుతారా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సంతకం..రైతుల పాలిట శాపం: రేవంత్ కేసీఆర్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారో చూస్తానని చాలెంజ్ చేశారు. పదేళ్లు తామే అధికారంలో ఉంటామని, ప్రజలు ఆమోదిస్తే మరో పదేళ్లు సీఎంగా ఉంటానని తెలిపారు. అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకని ప్రశ్నించారు. ఆకేసీఆర్ ఆడే డ్రామాలను అందరూ చూశారని తెలిపారు. కొత్తగా ఎంపికైనా పోలీసులే కేసీఆర్‌ను లాకప్‌లో వేస్తారని అన్నారు. కృష్ణా జలాలపై గత సీఎం పెట్టిన సంతకమే.. రైతుల పాలిట శాపంగా మారిందని దుయ్యబట్టారు. చదవండి: 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది: సీఎం రేవంత్ రేవంత్‌కు చేతగాక పోతే దిగిపోవాలి: హరీష్ రావు రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా బాధ్యతలు తీసుకుని మేడిగడ్డ ద్వారా నీళ్లను ఎత్తిపొసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రేవంత్ రెడ్డికి చేతగాక పోతే దిగిపోవాలని అన్నారు. కేసీఆర్ త్వరలోనే అసెంబ్లీకి వస్తారని చెప్పారు. ఇవాళ కేసీఆర్ బాష మీద మాట్లాడుతున్న రేవంత్.. గతంలో కేసీఆర్‌ను కాల్చిపారేయాలి, ఉరి తీయాలన్నారని గుర్తు చేశారు. అలాంటి పదాలు శాసనసభలో ఉపయోగించవచ్చా అని ప్రశ్నించారు. మేడిగడ్డను బూతద్దంలో పెట్టి చూపుతున్నారు పార్లమెంట్ సీట్ల కోసం కాళేశ్వరంపై రాజకీయం చేస్తున్నారని హరీష్ రావు ద్వజమెత్తారు. మేడిగడ్డ వెళ్లినవాళ్లు ఇతర రిజర్వాయర్లు కూడా చూడాల్సిందని హితవు పలికారు. మేడిగడ్డను బూతద్దంలో పెట్టి చూపుతున్నారని, మేడిగడ్డపై ఏ విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలోనే తాము చెప్పామని తెలిపారు. వెంటనే పునరుద్దరణ చర్యలు చేపట్టాలని కోరామని అన్నారు. చరిత్రలో జరగనిదేదో జరిగిందని చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని అన్నారు. కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. మేడిగడ్డ పునరుద్దరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. -
తెలంగాణ: ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ
ఢిల్లీ: తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక.. అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, చంద్రశేఖర్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి ఎంపిక చేసింది. మధ్య ప్రదేశ్ నుంచి అశోక్‌సింగ్‌ను ఏఐసీసీ ఎంపిక చేసింది. వీరంతా రేపు(గురువారం) నామినేషన్ వేయనున్నారు. రేణుకా చౌదరీ ఎవరి కోటా.? తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసిన రేణుకా చౌదరీ పేరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విశాఖలో పుట్టిపెరిగిన రేణుకా చౌదరీ.. బెంగళూరులో చదువుకున్నారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1986 నుంచి 1998 వరకు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా పని చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 1998లో టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేణుకా ఖమ్మం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. వివాదస్పద ప్రకటనలు చేసి తరచుగా వార్తల్లోకెక్కే రేణుకా చౌదరీ మరోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. అనిల్ కుమార్ యాదవ్ పేరు ఆశ్చర్యమే.! తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానికి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటన వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "నాలాంటి యువకుడికి అధిష్ఠానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం అనందంగా ఉంది. కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు దక్కుతాయి అనడానికి ఇదే ఉదాహరణ. నాకు పదవి ఇవ్వడం అంటే యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి గుర్తించినట్టు.!. బీసీల తరపున కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తేవడమే రాహుల్ గాంధీ లక్ష్యం. బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ, నాకు రాజ్యసభ ఇవ్వడంతో కాంగ్రెస్ యువతకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభ అవకాశం ఇస్తారని.. నా జీవితంలో ఊహించలేదు" అని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. -
‘ఇదేనా ప్రజాపాలన?’.. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇదేనా ప్రజాపాలన?.. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘ఇదేనా ప్రజాపాలన..? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా?. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదు. ప్రతిపక్షాల గొంతు అనిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు ?. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం..’అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇక.. బుధవారం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్దకు చేరుకోగా.. పోలీసులు, మార్షల్స్ బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డగించారు. సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడ వద్దనే నిబంధన ఉందని పోలీసులు అన్నారు. ఈ క్రమంలో ఇటువంటి కొత్త రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్‌రావు, కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఇదేనా ప్రజాపాలన..? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదు. ప్రతిపక్షాల… pic.twitter.com/yxrID7RBW9 — Harish Rao Thanneeru (@BRSHarish) February 14, 2024