
గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): ‘గచ్చిబౌలి లో రూ.500 కోట్ల విలువ చేసే ఆరు ఎకరాల భూదా న్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ బాగోతం చిట్టా నా దగ్గర ఉంది.
బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌లో 20 ఎకరాల సింగిల్‌బిట్‌ను ఎవరి పేరిట కొన్నారో తెలుసు.. బంజారాహిల్స్ లోటస్‌పాండ్ సమీపంలోని భవంతిలో అధికా రులను పిలిపించుకొని సాగిస్తున్న దందాలన్నీ తెలుసు.. నన్ను గెలకొద్దు.. గెలికితే అంతుచూస్తా.. నాపై అవాకులు చెవాకులు పేలితే మొత్తం మీ బాగోతాలన్నీ బయ టపెడతా..’ అంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీఆర్‌ఎస్ కీలక నేతనుద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు.
బండి చేపట్టిన ప్రజాహి తయాత్ర ఐదో రోజు బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సబ్‌కాంట్రాక్ట్ సంస్థ నిర్వాకంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోయే ప్రమాదముందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని, ఆ సంస్థ ఎవరిదో.. అనే వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.
కటె ్టకాలేవరకు కేసీఆర్ దోచుకుంటడు..
కట్టెకాలే వరకు ప్రజల కోసం పనిచేస్తానన్న కేసీ ఆర్.. కట్టె కాలే వరకు ప్రజలను దోచుకుంటాడని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన కేసీఆర్‌ను అరెస్టు చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.