
(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇదేనా ప్రజాపాలన?.. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
‘ఇదేనా ప్రజాపాలన..? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా?. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదు. ప్రతిపక్షాల గొంతు అనిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు ?. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం..’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇక.. బుధవారం అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్దకు చేరుకోగా.. పోలీసులు, మార్షల్స్ బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డగించారు. సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడ వద్దనే నిబంధన ఉందని పోలీసులు అన్నారు. ఈ క్రమంలో ఇటువంటి కొత్త రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్‌రావు, కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.
ఇదేనా ప్రజాపాలన..?
— Harish Rao Thanneeru (@BRSHarish) February 14, 2024
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా?
అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదు.
ప్రతిపక్షాల… pic.twitter.com/yxrID7RBW9