పేటీఎం ఇండిపెండెన్స్‌ డే సేల్‌: భారీ క్యాష్‌బ్యాక్‌లు






ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు తమ బంపర్‌ డిస్కౌంట్‌ సేల్స్‌ను ప్రకటించిన అనంతరం.. మీకంటే మీమేమనా తక్కువా అని పేటీఎం మాల్‌ కూడా భారీ డీల్స్‌ను ప్రకటించింది. ఇండిపెండెన్స్‌ డేకి ముందస్తుగా పేటీఎం మాల్‌ తన యాప్‌, వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. మంగళవారం నుంచి అంటే ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, అప్లియెన్స్‌, అప్పీరల్స్‌, యాక్ససరీస్‌ వంటి అన్ని ఉత్పత్తులపైనా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను, డిస్కౌంట్లను అందించనున్నట్టు ఈ మాల్‌ వెల్లడించింది.

 

ఈ సేల్‌ సందర్భంగా ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు, ఇంకా 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో అతిపెద్ద హైలెట్‌, ఐఫోన్‌ 7పై 8000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయడం. అంతేకాక ఐఫోన్‌ ఎస్‌ఈపై కూడా ఫ్లాట్‌ 15 శాతం డిస్కౌంట్‌, రూ.3000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం అందిస్తోంది. దీంతో 27,200 రూపాయలుగా ఉన్న ఐఫోన్‌ ఎస్‌ఈ ధర 19,990కి దిగొచ్చింది. 

 

అంతేకాక షాపింగ్‌ ఓచర్లను, అదనంగా 5000 రూపాయల విలువ గల క్యాష్‌బ్యాక్‌ ఓచర్లను అందిస్తోంది. వీటిని విమానాలు‌, అప్పీరల్స్‌, మొబైల్‌ యాక్ససరీస్‌పై వాడుకోవచ్చు. ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్లు రూ.3000, రూ.3500 క్యాష్‌బ్యాక్‌లతో పేటీఎం మాల్‌లో లిస్టయ్యాయి. షావోమి ఇటీవల లాంచ్‌చేసిన ఎంఐ మ్యాక్స్‌ 2 కూడా పేటీఎం తన మాల్‌లో అందుబాటులో ఉంచింది. లెనోవో, మైక్రోమ్యాక్స్‌, వివో స్మార్ట్‌ఫోన్లపై కనీసం 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది.

 

ఇక ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే, ఆపిల్‌, హెచ్‌పీ, లెనోవో బ్రాండ్లపై రూ.20వేల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు పేటీఎం మాల్‌ చెప్పింది. ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ 13 అంగుళాల దానిపై ఫ్లాట్‌ రూ.10వేల క్యాష్‌బ్యాక్‌, లెనోవో ఐడియాప్యాడ్‌ 320పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌లను పేటీఎం లిస్టు చేసింది. అదేవిధంగా టీవీలు, వాషింగ్‌ మిషన్లపై 20వేల రూపాయల మేర క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్‌ చేస్తోంది. మిక్సర్‌ గ్రైండర్స్‌, ఫ్యాన్లపై 20 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ ఉంది. ఇలా పేటీఎం మాల్‌లో అందించే చాలా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top