35 శాతం వృద్ధి లక్ష్యం: యమహా | Yamaha eyes 35 pc sales growth in 2014 | Sakshi
Sakshi News home page

35 శాతం వృద్ధి లక్ష్యం: యమహా

Jan 10 2014 12:55 AM | Updated on Aug 27 2018 8:31 PM

చిల్డ్రన్ సేఫ్టీ పై ఆవిష్కరించిన మస్కట్ - Sakshi

చిల్డ్రన్ సేఫ్టీ పై ఆవిష్కరించిన మస్కట్

ఈ ఏడాది అమ్మకాల్లో 35 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ (వైఎంఐఎస్) వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ గురువారం తెలిపారు.

న్యూఢిల్లీ: ఈ ఏడాది అమ్మకాల్లో 35 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ (వైఎంఐఎస్) వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ గురువారం తెలిపారు. గత ఏడాది 4.6 లక్షల వాహనాలను విక్రయించామని, ఈ ఏడాది 6.2 లక్షల వాహనాలు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గత ఏడాది 1.5 లక్షల స్కూటర్లను అమ్మామని, ఈ ఏడాది 2.8 లక్షల స్కూటర్లను విక్రయించాలనేది లక్ష్యమని తెలిపారు.
 
  టైర్ టూ నగరాల్లో తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోనున్నామని, టైర్ 3 నగరాలపై దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు.  పిల్లల కోసం ఒక భద్రతా కార్యక్రమం, యమహా చిల్డ్రన్ సేఫ్టీ ప్రోగ్రామ్(వైసీఎస్‌పీ)ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మస్కట్‌ను ఆవిష్కరించామని పేర్కొన్నారు. త్వరలో కుటుంబమంతా వినియోగించుకునే స్కూటర్‌ను మార్కెట్లోకి తెస్తామని వివరించారు. తామందిస్తున్న ఎఫ్‌జడ్, ఫేజర్, ఆర్15 మోటార్ బైక్‌లకు చిన్న నగరాల్లో కూడా మంచి స్పందన లభిస్తోందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement