breaking news
Roy Kurian
-
యమహా సెల్యూటొ కొత్త వేరియంట్
ధర రూ. 54,500 న్యూఢిల్లీ : యమహా కంపెనీ 125 సీసీ సెల్యూటొ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. డిస్క్ బ్రేక్ ఫీచర్‌తో ఉన్న ఈ కొత్త వేరి యంట్ ధర రూ.54,500 అని (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. సిటీ ట్రాఫిక్ పరిస్థితులను సమర్థంగా తట్టుకునేలా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించామని వివరించారు. 125 సీసీ కేటగిరీలో అమ్మకాలు పెంచుకోవడం లక్ష్యంగా ఈ బైక్‌ను తెచ్చామని పేర్కొన్నారు. ఈ బైక్ మంచి అమ్మకాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా మంచి వృద్ధి సాధిస్తున్న తమ అమ్మకాలు ఈ కొత్త సెల్యూటొతో మరింతగా పుంజుకుంటాయని నమ్మకముందని పేర్కొన్నారు. -
యమహా చౌక బైక్ వస్తోంది..!
ధర రూ.30 వేల లోపు ఉండొచ్చు ఎఫ్‌జెడ్ సిరీస్‌లో రెండు కొత్త వేరియంట్లు విడుదల ధరలు రూ.76,250-రూ.78,250 న్యూఢిల్లీ: యమహా కంపెనీ త్వరలో చౌక బైక్(500 డాలర్లు-రూ.30,000)ను మార్కెట్లోకి తేనున్నది. ఎఫ్‌జెడ్ బైక్‌ల్లో (150 సీసీ కేటగిరీ) రెండు కొత్త వేరియంట్లను అందిస్తోంది. ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్-ఎస్‌ల్లో అప్‌గ్రేడెడ్ వేరియంట్లను సోమవారం ఆవిష్కరించింది. ఎఫ్‌జెడ్ సిరీస్‌ను 2008లో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టామని యమహా ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) రాయ్ కురియన్ తెలిపారు. నేటి(మంగళవారం)నుంచి ఎఫ్‌జెడ్ వెర్షన్ 2.0(ధర రూ.76,250), ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0(రూ.78,250- ఈ రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ను విక్రయిస్తామని వివరించారు. ప్రస్తుతం ఫేజర్‌తో సహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లను నెలకు 18వేల వరకూ విక్రయిస్తున్నామన్నారు. తాజాగా అందిస్తున్న ఈ అప్‌గ్రేడెడ్ వేరియంట్లతో కలుపుకొని అమ్మకాలు నెలకు 24 వేలకు పెరుగుతాయని అంచనాలున్నాయని చెప్పారు. రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మిస్తోన్న చెన్నై ప్లాంట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్ నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వివరించారు. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 18 లక్షలని పేర్కొన్నారు. 500 డాలర్ల యమహా బైక్: త్వరలో చౌక బైక్ (500 డాలర్లు-రూ.30,000)ను అందించనున్నామని యమహా మోటార్ ఆర్ అండ్ డీ ఇండియా ఎండీ తొషికజు కొబయాషి చెప్పారు. ఈ చౌక బైక్‌పై కసరత్తు జరుగుతోందని, ధర విషయం ఇప్పుడే నిర్ణయాత్మకంగా చెప్పలేమని పేర్కొన్నారు. 500 డాలర్ల ధరకే అందించాలని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నామని తెలిపారు. అయితే ఈ బైక్‌ను ఎప్పుడు మార్కెట్లోకి తెచ్చేది వెల్లడించలేదు. ఈ చౌక బైక్ కారణంగా తమ మార్కెట్ వాటా మరింతగా పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్కూటర్లు, 150 సీసీ కేటగిరీ బైక్‌ల్లో పటిష్టమైన స్థానానికి చేరిన తర్వాత ఇతర సెగ్మెంట్లలోకి ప్రవేశిస్తామని రాయ్ కురియన్ వివరించారు. ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి తమ అమ్మకాలు 32% పెరిగాయని, ఇదే జోరు కొనసాగనున్నదని కురియన్ పేర్కొన్నారు. గతేడాది 4.47 లక్షల టూవీలర్లను విక్రయించామని, ఈ ఏడాది 6 లక్షల టూవీలర్లను విక్రయించనున్నామని చెప్పారు. ప్రస్తుతం 1,300గా ఉన్న డీలర్ల సంఖ్యను ఈ ఏడాది చివరికల్లా 1,600కు పెంచనున్నామని ఆయన పేర్కొన్నారు. -
35 శాతం వృద్ధి లక్ష్యం: యమహా
న్యూఢిల్లీ: ఈ ఏడాది అమ్మకాల్లో 35 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ (వైఎంఐఎస్) వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ గురువారం తెలిపారు. గత ఏడాది 4.6 లక్షల వాహనాలను విక్రయించామని, ఈ ఏడాది 6.2 లక్షల వాహనాలు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గత ఏడాది 1.5 లక్షల స్కూటర్లను అమ్మామని, ఈ ఏడాది 2.8 లక్షల స్కూటర్లను విక్రయించాలనేది లక్ష్యమని తెలిపారు. టైర్ టూ నగరాల్లో తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోనున్నామని, టైర్ 3 నగరాలపై దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. పిల్లల కోసం ఒక భద్రతా కార్యక్రమం, యమహా చిల్డ్రన్ సేఫ్టీ ప్రోగ్రామ్(వైసీఎస్పీ)ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మస్కట్‌ను ఆవిష్కరించామని పేర్కొన్నారు. త్వరలో కుటుంబమంతా వినియోగించుకునే స్కూటర్‌ను మార్కెట్లోకి తెస్తామని వివరించారు. తామందిస్తున్న ఎఫ్‌జడ్, ఫేజర్, ఆర్15 మోటార్ బైక్‌లకు చిన్న నగరాల్లో కూడా మంచి స్పందన లభిస్తోందని వివరించారు.